Courtesy: Christian Today & Wire | Christians in Assam gathered for prayer | Representative Picture
అస్సాంలోని ఒక క్రైస్తవ హక్కుల సంస్థ ఆ రాష్ట్ర పోలీసులు సంఘాల్లోనికి చొరబడి సమాచారం సేకరించడంపై కలవరం వ్యక్తపరిచింది. ఇది విశ్వాసులను భయపెట్టదలిచే ఒక గూడచర్య పనిగా అభిప్రాయపడింది. రాష్ట్ర యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యు.సి.ఎఫ్.) వారు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ అసాధారణ గూఢచార పనిని తక్షణం నిలిపివేయాలని జిల్లా కమిషనర్ ను కోరారు.
గతవారం జిల్లా కమిషనర్ కు ఇచ్చిన మెమోరాండంలో యు.సి.ఎఫ్ వారు—”యూనిఫామ్ ధరించిన పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ అధికార ఉత్తర్వులు కానీ లేకుండా వచ్చి ఫోటోలు తీయడం, సంఘ వివరాలన్నింటి సమాచారం అడుగుతున్నారని” తెలియజేసింది. ఈ విధమైన చర్య విశ్వాసులలో భయాన్ని, ఆందోళనను కలిగించిందని అస్సాం క్రిస్టియన్ ఫోరం ప్రతినిధి అలెన్ బ్రూక్స్ అన్నారు.
అయితే పోలీసులు—”క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలపై హిందూ అతివాద సంస్థల బెదిరింపుల దృష్ట్యా సమగ్ర సమాచారం కోసమే మేము ఈ సేకరణ చేస్తున్నామని” తమ పనిని సమర్థించుకున్నారు.
పోలీసుల వాదనను ఖండిస్తూ యు.సి.ఎఫ్. సెక్రెటరీ—”చర్చిల దగ్గర సమాచారం సేకరించడానికి విద్యాసంస్థలకు వచ్చిన బెదిరింపులకు ఎటువంటి సంబంధం లేదని, పోలీసులు వచ్చిన చర్చీలకు ఎటువంటి విద్యాసంస్థలు లేవని” ఆరోపించారు.