గాస్పల్ ఫర్ ఆసియా సంస్థ వ్యవస్థాపకుడూ, అధ్యక్షుడూ ఐన కేపీ యోహన్నన్ అమెరికాలో గుండెపోటుతో పరమపదించారు. ఈ నెల 8, బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న వీరు మంగళవారం మార్నింగ్ వాక్ చేస్తూ కారు ప్రమాదానికి గురవ్వడంతో హుటాహుటిన వీరిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఆసుపత్రిలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించినట్టు సమాచారం.
ఈ సందర్భంగా “విశ్వాస పోరాటంలో చివరివరకూ నమ్మకంగా కొనసాగడానికి తన సేవకునికి కృప చూపించిన దేవునికి స్తోత్రాలు” అంటూ జీ.ఎఫ్.ఏ. ఒక ప్రకటన విడుదల చేసింది.
యోహన్నన్ గారు 1979లో గాస్పెల్ ఫర్ ఆసియాను స్థాపించి, భారత దేశంలో ప్రభావవంతమైన సేవ జరిగించారు. అనేకమంది ఈ సంస్థ ద్వారా వేదాంత విద్యను అభ్యసించడమే గాక పరిచర్యకు సమర్పించుకున్నారు. వీరు సుమారు 250 పుస్తకాలను ఈయన ప్రచురించారు.