ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన గర్భ ధారణ సమయంలో తన సొంత అనుభవాలతో పాటు ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలతో కూడిన పుస్తకానికి “కరీనాకపూర్ ఖాన్—ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పేరు పెట్టడం వివాదాస్పదమైంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విషయమై ఆమెకు లీగల్ నోటీస్ పంపడం జరిగింది.
జబల్పూర్ కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త క్రిస్టఫర్ ఆంథోనీ ఈ విషయమై కోర్టు మెట్లు ఎక్కారు. “పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ను క్రైస్తవ ప్రపంచమంతా గౌరవిస్తారని కేవలం పబ్లిసిటీ కోసం తన పుస్తకానికి బైబిల్ అని పేరు పెట్టడం ఆమోదయోగ్యం కాదని” ఆయన అన్నారు.
నోటీసు అందుకున్న ఏడు రోజుల్లోపు స్పందించాలని తెలుపుతూ తదుపరి విచారణను జూలై ఒకటో తేదీకి వాయిదా వేశారు.