ఈరోజు జాన్ విక్లీఫ్ సిద్ధాంతాలను వ్యాపింప చేస్తున్న జాన్ హస్ మొదలైన వారికి జర్మన్ యునివర్సిటీ పండితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

ఆర్చి బిషప్ అరుండెల్ 1407 లో జరిగిన ఆక్స్ ఫర్డ్ సినడ్ లో విక్లీఫ్ బోధలను, సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తూ—ఈరోజు నుంచి పరిశుద్ధ లేఖనాలను ఇంగ్లీషులోనికి గాని మరి ఏదైనా భాషలోనికి గాని అనువదించడానికి ఎవరికీ అధికారం లేదని, ఒక పుస్తకం గాని పాంప్లెట్ గాని కరపత్రిక గాని, జాన్ విక్లిఫ్ సమయములోనిదైనా తర్వాత సమయంలోనిదైనా కమిటీ అనుమతి లేనిదే దానిని కలిగి ఉండకూడదని నిర్ణయించారు. బహిరంగంగా గాని వ్యక్తిగతంగా గాని వాటిని చదవకూడదని నిషేధించారు.

ఈ నిషేధం తీవ్రంగా అమలు చేయడం జరిగింది. ఇంగ్లీష్ బైబిల్ కలిగి ఉన్నారని చదువుతున్నారని అనేక మంది మీద కేసులు బనాయించబడ్డాయి.
ఇంగ్లీష్ బైబిల్ కలిగి ఉండడమే ప్రమాదంగా పరిణమించింది. అది వీక్లీఫ్ రచనలకు సంబంధించినదైతే ఆ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది.