నేను ఒకప్పుడు అన్యురాల్ని. రక్షణ పొందిన ఐదేళ్లకు వెరిటాస్ బైబిల్ స్కూల్లో చేరే అవకాశం దేవుడు కల్పించాడు. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనే తపనతో ఉన్న రోజుల్లో వెరిటాస్ పరిచయం అయ్యింది. ప్రకాష్ అన్న క్లాసుల్లో దేవుని ఉనికి, సంపూర్ణ స్వభావం ఆయన ప్రేమ, పవిత్రత ఇలా ఎన్నో గొప్ప సంగతులను నేర్చుకునే భాగ్యం దొరికింది. నశించి పోతున్న నన్ను వెదికి, విముక్తి చేయడానికి వచ్చిన ఆ క్రీస్తు ప్రేమను నేను వెరిటాస్ ద్వారా సంపూర్తిగా గ్రహించాను. ఈ రోజు నేను వాక్యంలో బలపడి, దేవునికి దగ్గరగా జీవించడానికి వెరిటాస్ కారణం. పేరుకు తగ్గట్టే వెరిటాస్ లో సత్య వాక్య ప్రబోధం జరుగుతోంది. ఈ తర్ఫీదు వల్ల నేను కొందరు స్త్రీలకు వాక్య ప్రబోధం చేయడానికి దేవుడు సాయం చేశాడు.