నేను వెరిటాస్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత సత్య వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ముఖ్యంగా క్రీస్తు సిలువలో చేసిన త్యాగం, క్రైస్తవ జీవన విధానం, సమాజంలో చొరబడిన అబద్ధ బోధలు, బోధకులను ఎలా గుర్తించాలి, వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, దానిని మన జీవితంలో ఏ విధంగా అలవర్చుకోవాలి, ఇతరులకు ఎలా పరిచయం చేయాలి, దేవుడు మన కోసం ఏం చేసాడు, మనం దేవుని కోసం ఏం చేయాలి… ఇలా ఎన్నో సత్యాలు తెలుసుకున్నాను. సత్య వాక్యాన్ని నాలో నింపి, నాకు నేర్పించి, నా వ్యక్తిగత జీవితానికి నా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న వెరిటాస్ వేద పాఠశాలకు నా ధన్యవాదాలు!