సత్య వాక్కు గురించి గాని, క్రీస్తు వ్యక్తితత్వం గురించి గాని ఎటువంటి అవగాహన లేకుండా ఆచార బద్దమైన క్రైస్తవ్యంలో ఉన్న మమ్మల్ని దైవ జ్ఞానంతో అన్న చెప్పిన సందేశాలు ఎంతగానో ప్రభావితం చేసాయి. దైవ వాక్యాన్ని ప్రభువు కోణంలో చదువుతూ, జీవించే విధానం నేర్చుకున్నాం. క్రీస్తును ఆరాధిస్తూ, క్రియల ద్వారా క్రీస్తును ప్రకటించాలని, అంతిమంగా క్రీస్తు స్వారూప్యతలోకి మారాలనీ తెలుసుకున్నాం. ఇలా అనేక సత్యాలను వెరిటాస్ పరిచర్య ద్వారా మేము తెలుసు కోవడానికి దేవుడు సహాయం చేసారు.