రోమన్ కాథలిక్ సంఘ బోధనా క్రమాలలో ప్రముఖమైన డొమినికన్ ఆర్డర్ రూపకర్త, స్పెయిన్ కు చెందిన మతగురువు సెయింట్ డొమినిక్ పరమపదించిన రోజు ఈ రోజు. రాత్రంతా ప్రార్థనలో గడిపే అలవాటున్న ఈ ఫాదర్, ఉదయాన్నే డొమినికన్ ఆర్డర్ ప్రకారం ప్రజలలోకి వెళ్లి, ప్రజలతో మమేకమై దేవుని మాటలు వినిపించేవారు. ఒకసారి ఒక విధవరాలి కుమారునికి ప్రతిగా తనను తాను ఒక బానిసగా అమ్మివేసుకుని క్రీస్తు ప్రేమను తన జీవితంలో ఎప్పుడూ చూపించేవారు.