రవి అస్తమించని రోమ్ సామ్రాజ్య కీర్తి శిఖరంలో మకుటాయమానంగా ఉన్న
కాన్స్టాంటినోపుల్ మహా నగరం కుప్పకూలిన రోజు. నాటి రోమ్ సామ్రాజ్యాధినేత కాన్స్టెంటైన్ క్రీ.శ. 324లో స్థాపించిన రాజధాని నగరమిది. రెండో సుల్తాన్ మహమ్మద్ నాయకత్వంలోని ఒట్టోమన్ సైన్యం ఏప్రిల్ 6న ఈ నగరాన్ని ముట్టడి చేసింది. యుద్ధం యాభై మూడో రోజున, 1453 మే 29న శత్రు సైన్యం స్వాధీనం చేసుకోవడంతో ఈ నగర వైభవ చరిత్ర ముగిసిపోయింది.

కాన్స్టాంటినోపుల్ స్వాధీనం తర్వాత దాని పేరుని ఇస్తాన్బుల్ గా మార్చేశారు. అలాగే నగరానికి అలంకారంగా ఉన్న అతి పెద్ద చర్చ్ “ద చర్చ్ ఆఫ్ ది హోలీ విజ్డం”ని ‘ది హగియా సోఫియా’ మసీదుగా మార్చేశారు.