
నేటి విశ్వాస నాయకురాలు
క్వీన్ ఎలిజబెత్ I
పరలోక పిలుపు : 24 మార్చి 1603
ఇంగ్లాండ్ – మహిమాన్విత రాణి, ప్రొటెస్టంట్ మద్దతుదారు, వర్జిన్ క్వీన్, రాజకీయ – మత సంస్కర్త.
క్వీన్ ఎలిజబెత్ I (1533–1603) ఈమె 1558 నుండి మరణించే వరకు ఇంగ్లండ్ – ఐర్లాండ్లను పాలించింది, ట్యూడర్ రాజవంశంలో చివరి మరియు ఎక్కువ కాలం పాలించిన, వర్జిన్ క్వీన్ అని పిలువబడే ఈమె వివాహం చేసుకోలేదు. పురుషాధిక్య ప్రపంచంలో తన అధికారాన్ని నైపుణ్యంగా కొనసాగించింది. ఇంగ్లండ్ లో ప్రొటెస్టంటిజాన్ని దృఢంగా స్థాపించడంలో కీలక పాత్ర పోషిం చెను. ప్రొటెస్టంట్ లను ఘోరాతి ఘోరంగా హింసించిన ఈమె కాథలిక్ సోదరి, మేరీ.I పాలన తర్వాత, ఎలిజబెత్ కాథలిక్ పునరుద్ధరణను తిప్పికొట్టి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను తిరిగి స్థాపించింది. ఈమె సర్వోన్నత చట్టాన్ని ఆమోదించి, తనను తాను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సుప్రీం గవర్నర్గా చేసింది, పాపల్ అధికారాన్ని తిరస్కరించింది. ఈమె ఇంగ్లీష్ బైబిల్ అనువాదాలను, ప్రొటెస్టంట్ బోధనలను ప్రోత్సహించింది. జాన్ ఫాక్స్ వంటి వ్యక్తులను, ఇంగ్లాండ్ ప్రొటెస్టంట్ గుర్తింపును రూపొందించడానికి అనుమతించింది. ఈమె పాలనలో, ఇంగ్లండ్ ప్రొటెస్టంటిజం, బలమైన కోటగా మారింది, ఇది ప్యూరిటానిజం, ఎవాంజెలికల్ మిషన్ల పెరుగుదల వంటి తరువాతి ఉద్యమాలను ప్రభావితం చేసింది. ఈమె సుదీర్ఘ స్థిరమైన పాలన, బలమైన జాతీయ గుర్తింపును అందించింది, “గ్లోరియానా” మరియు “గుడ్ క్వీన్ బెస్ గా ఈమె శాశ్వతమైన ప్రశంసలను పొందింది. దేవుడు తన ప్రజలను మలుచుటకు, దేవునికి మహిమ కలగని విశ్వాసములో నుండి, ప్రజలను కాపాడటానికి, ఎలిజబెత్-Iను ఒక పాత్రగా ఎంచుకున్నాడు. ఈమెను ప్రభువే ఏర్పరచి, ఆయన ప్రజలను పాలించటానికి స్థిరపరచెను. ఇది, ఎలిజబెతన్ రిలిజియస్ సెటిల్మెంట్ ద్వారా గుర్తించబడింది, ఇది రోమన్ కాథలిక్కులకు భిన్నంగా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను దృఢంగా స్థాపించింది. ఈ స్థిరత్వం ప్రొటెస్టంట్ వేదాంతశాస్త్రం అభివృద్ధి, వ్యాప్తి చెందడానికి అనుమతించింది, ఇది వివిధ ప్రొటెస్టంట్ తెగల పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా, తర్వాత శతాబ్దాల్లో ఇంగ్లండ్ మిషనరీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. UK నుండి చాలా మంది ప్రొటెస్టంట్ మిషనరీలు సువార్తను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లారు, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశారు, క్రీస్తు ప్రేమను, లోకానికి రుచి చూపించారు. ఈ కాలం నిజానికి దేవుని రాజ్య విస్తరణకు సంబంధించిన దైవిక ప్రణాళికలో గొప్ప మలుపు. ఈమె దేవునికి ఇష్టురాలుగా, ఆయన కనుసన్నలలో పరిపాలించెను. మత పరమైన వివాదాలన్నింటిని సమర్థవంతంగా పరిష్కరించెను. ఈమె పాలన ఇంగ్లాండ్లో స్వర్ణయుగం, ఎందుకంటే, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ఈమె పెళ్లి చేసుకోలేదు, వారసులను ఉద్దేశించుకోలేదు, ఈమె గౌరవనీయమైన మహారాణిగా, ధైర్యవంతమైన నాయకత్వం, తెగువ, తెలివైన రాజకీయం, స్వతంత్రత, ధార్మిక సహనశీలత, వివేకము, రాజకీయ చతురత, పరిపాలనలో తెలివైన నిర్ణయాలు తీసుకొని, అన్ని రంగాలలో రాజ్యమును అభివృద్ధి పరచి, గౌరవనీయమైన, శక్తివంతమైన దేశంగా మార్చింది.
ఎలిజబెత్.I, ఇంగ్లాండును పాలించిన కింగ్ హెన్రీ. VIII అన్నే బోలీన్ ల కుమార్తెగా, 1533, సెప్టెంబరు 7న, గ్రీన్విచ్ ప్యాలెస్ లో జన్మించెను. ఈమె మొదట్లో వారసురాలు. అయితే, 1536లో ఈమె తల్లి ఉరి తీయబడిన తర్వాత, ఎలిజబెత్ చట్టవిరుద్ధమని ప్రకటించబడి, వారసత్వ రేఖ నుండి తొలగించబడింది. అయినప్పటికీ, ఈమె విలియం గ్రిండాల్, రోజర్ అస్చమ్ వంటి ట్యూటర్ల క్రింద అసాధారణమైన విద్యను పొందింది, లాటిన్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్తో సహా పలు భాషలలో నిష్ణాతులుగా మారింది. ఈమె యుక్తవయసులోనే శాస్త్రీయ రచనలను అనువదించింది. తన జీవితాంతం, పాండిత్య కార్యకలాపాలను కొనసాగించింది. ఈమె తెలివితేటలు, భాషా నైపుణ్యాలు ఈమె కాలంలో అత్యంత విద్యావంతులైన మహిళల్లో ఒకరిగా చేశాయి.
కింగ్ హెన్రీ. VIII, ప్రధమ కుమార్తె మేరీ. I , ఈమె తల్లిని బట్టి క్యాథలిక్, ఈమె హింసాత్మక చర్యలను బట్టి, బ్లడీ మేరీ గా పిలువబడింది. వారసురాలిగా పాలన ప్రారంభించెను, ప్రొటెస్టంట్ అయిన ఎలిజబెత్, ఈమె తల్లి వేరు. 1554లో వ్యాట్ యొక్క తిరుగుబాటు తర్వాత టవర్ ఆఫ్ లండన్ లో ఖైదు చేయబడింది, 1555లో మేరీ గర్భం దాల్చినట్లు అబద్ధమని తేలినప్పుడు, వారసురాలిగా ఎలిజబెత్ స్థానం బలపడింది. 17 నవంబర్ 1558న, మేరీ మరణించగా, ఎలిజబెత్ 25 ఏళ్ళ వయసులో రాణి అయింది. ఈమె దేవుని మార్గదర్శకత్వం, మంచి సలహాలపై ఆధారపడుతున్నట్లు ప్రకటించింది. 1559 జనవరి 15న ఈమె పట్టాభిషేకం విస్తృత వేడుకగా జరిగింది. ఈమె పాలన ఇంగ్లాండ్లో ప్రొటెస్టంట్ మతాన్ని దృఢంగా స్థాపించడంలో కీలకమైనది, కాథలిక్కుల నుండి దేశాన్ని దూరం చేసింది. చట్టపరమైన చర్యలకు మించి, ఆమె ఆంగ్ల బైబిల్ అనువాదాల వ్యాప్తిని ప్రోత్సహించింది, ప్రొటెస్టంట్ సాహిత్యాన్ని ప్రోత్సహించింది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సిద్ధాంతాన్ని రూపొందించిన వేదాంతవేత్తలను తగిన విధంగా గౌరవించింది. ఈమె కాథలిక్ లకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేసింది. ఆంగ్లికన్ సేవలకు హాజరు కావడానికి నిరాకరించిన వారికి జరిమానాలు విధించింది. కుట్రదారులైన క్యాథలిక్ పూజారులకు తగిన శిక్ష విధించెను.
ఈమె చివరి సంవత్సరాల్లో డిప్రెషన్తో బాధపడింది, ముఖ్యంగా సన్నిహితుల మరణం తర్వాత. ఈమె వారసుడిని ఎన్నడూ పేర్కొనలేదు, ఈమె 71 వ ఏట, 44 సంవత్సరాలు అజేయంగా పరిపాలించి, ప్రజలందరి మన్ననలు పొంది, దేవునియొద్దకు చేర్చబడెను. ఈమె వెస్ట్ మినిస్టర్ అబ్బేలో సమాధి చేయబడింది. ఈమె వారసత్వం తరువాతి తరాలచే రూపొందించబడింది, ప్రారంభ ప్రొటెస్టంట్ ఆరాధకులు ఈమె పాలనా కాలమును స్వర్ణయుగంగా చిత్రీకరించారు.