
బైబిలు గ్రంథాన్ని చైనా భాషలోకి అనువదించిన చైనా మిషనరీ రాబర్ట్ మోరిసన్ పరమపదించినరోజు ఈ రోజు. ఈ ఇంగ్లాండ్ దేశ పౌరుడు—తొలి ఇంగ్లీష్ ప్రొటెస్టంట్ మిషనరీగా చైనా దేశానికి వెళ్లి, 12 సం.లలో బైబిలును అనువదించడమే కాక, చైనీస్ వ్యాకరణాన్ని రూపొందించారు. ఆరు సంపుటాల చైనీస్-ఇంగ్లీష్ నిఘంటువును రాశారు. ఒక ఆంగ్లో-చైనీస్ కళాశాలను స్థాపించారు. ఈయన 27 సం.ల పరిచర్య తరువాతి మిషనరీలందరికీ మార్గదర్శకమైంది.