
నేటి విశ్వాస నాయకుడు
అదోనీరామ్ జడ్సన్
పరలోక పిలుపు : 12 ఏప్రిల్ 1850
మార్గదర్శక మిషనరీ, సువార్తికుడు, కాంగ్రిగేషనలిస్ట్, సంఘ స్థాపకుడు, బైబిలు అనువాదకుడు.
అదోనీరామ్ జడ్సన్ (1788-1850) అత్యంత ప్రభావశీలమైన ప్రపంచ ప్రొటెస్టెంట్ మిషనరీలలో ఒకరుగా, ఈయన బర్మా (ఇప్పుడు మయన్మార్)కి క్రైస్తవ మతాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన అమెరికా నుండి ఆసియాకు పంపబడిన మొదటి ప్రొటెస్టంట్ మిషనరీలలో ఒకడు. విద్యార్థి సమూహం అయిన బ్రదర్న్ మిషన్ లో మొదట భాగమైన భారతదేశానికి వెళ్ళేటప్పుడు లేఖనాలను చదివాడు, విశ్వాసానికి సాక్ష్యంగా ఒక విశ్వాసి బాప్టిజం పొందాలని ఒప్పించాడు. భారతదేశానికి చేరుకున్న తర్వాత, ఈయన తన భార్యతో బర్మాకు ప్రయాణించే ముందు బాప్తిస్మము పొందారు, అక్కడ వారు మొదటి బాప్టిస్ట్ మిషన్‌ను స్థాపించారు. సహ-మిషనరీ, లూథర్ రైస్ కూడా ఈయనతో ఒప్పించబడి బాప్తిస్మము వీరితో పాటు బాప్తిస్మము తీసుకున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా, రైస్ అమెరికాకు తిరిగి వచ్చి అక్కడ మిషన్ల కోసం వాదించడం ప్రారంభించాడు, ఇది 1814లో ట్రినియల్ కన్వెన్షన్ ఏర్పాటుకు దారితీసింది, U.S.లోని మొదటి జాతీయ బాప్టిస్ట్ మిషనరీ సంస్థ బర్మాలో అనేక బాప్టిస్ట్ చర్చిలను స్థాపించింది, బైబిల్ ను బర్మీస్‌లోకి అనువదించింది. ఈయన సేవ బర్మాలో క్రైస్తవ మతానికి పునాది వేసింది, అపారమైన కష్టాలు ఉన్నప్పటికీ ఈయన పట్టుదల తరాల మిషనరీలను ప్రేరేపిస్తుంది. ఈయన అంకితభావం కరెన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ ఏర్పాటుకు కూడా దోహదపడింది, ఇది నేడు మయన్మార్‌లో అభివృద్ధి చెందుతోంది.
జడ్సన్ ఆగస్టు 9, 1788న మసాచుసెట్స్, మాల్డెన్ లో ఒక కాంగ్రిగేషనల్ బోధకునికి జన్మించాడు. ఈయన 19 సంవత్సరాల వయస్సులో బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి వాలెడిక్టోరియన్ గా పట్టభద్రుడయ్యాడు, చిన్ననాటి విశ్వాసమును కోల్పోయి, ఆండోవర్ థియోలాజికల్ సెమినరీలో చదువుతున్నప్పుడు, తిరిగి క్రైస్తవ్యానికి చేర్చబడ్డాడు. 1810లో ఈయన బ్రదరన్ మిషన్ ఫోకస్డ్ స్టూడెంట్ గ్రూప్ లో చేరాడు., ఇది అమెరికా మొదటి మిషనరీ సొసైటీని స్థాపించడంలో సహాయపడింది. ఈయన మిషనరీ సేవ కోసం ఆసియాకు పిలిచినట్లు భావించి, విదేశీ మిషన్ల కోసం అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమీషనర్స్చే నియమించబడ్డాడు. ఈయన ఫిబ్రవరి 5, 1812న ఆన్ హాసెల్టైన్ ను వివాహం చేసుకున్నాడు, మరుసటి రోజే, తోటి మిషనరీలతో కలిసి కారవాన్‌లో ఫిబ్రవరి 19న ఆసియాకు ప్రయాణించాడు.
జడ్సన్ జూన్ 17, 1812న కలకత్తా చేరుకున్నారు. సముద్రయానంలో, జడ్సన్ బాప్టిజం గురించి అధ్యయనం చేసి, విశ్వాసికి బాప్టిజం బైబిల్ ప్రకారం తప్పనిసరి అని నిర్ధారించాడు. సెప్టెంబరు 6, 1812న, ఈయన తన భార్యతో కలసి విలియం వార్డ్ ద్వారా బాప్తిస్మము తీసుకొని, బాప్టిస్ట్ డినామినేషన్‌లోకి మారారు. అమెరికన్ మిషనరీలపై బ్రిటిష్ వ్యతిరేకత కారణంగా, జడ్సన్‌లను భారతదేశం విడిచి వెళ్ళవలసివచ్చి, జూలై 1813లో, వారు బర్మాకు వెళ్లే మార్గంలో తన భార్యకు గర్భస్రావం జరిగింది. బౌద్ధమతం లోతుగా వేళ్లూనుకున్న బర్మాకు చేరుకున్న తర్వాత జడ్సన్‌లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మిషనరీ పనికి ప్రతిఘటన ఎదురైంది. ఈయన బర్మీస్ నేర్చుకోవడానికి తనను తాను అంకితం చేసుకొని, భాషలో ప్రావీణ్యం సంపాదించడానికి సంవత్సరాలు గడిపాడు. ఈయన స్థానికులతో నిమగ్నమవ్వడానికి చిన్న శరణాలయంను నిర్మించాడు, 1819లో తన మొదటి బర్మీస్ మతమార్పిడి అయిన మౌంగ్ నావ్ కి బాప్తిస్మము ఇచ్చాడు. 12 సంవత్సరాలలో 18 మంది మతమార్పిడులు జరిగాయి, అయితే జడ్సన్ ఎటువంటి నిరాశ లేకుండా తన మిషన్‌ను కొనసాగించాడు. మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం (1824-1826) వారి మిషన్‌కు అంతరాయం కలిగించింది, ఇది జడ్సన్ 17 నెలల జైలు శిక్షకు దారితీసింది. ఈయన విడుదలైన తర్వాత, కొత్త మిషన్ ఫీల్డ్‌లను అన్వేషిస్తున్నప్పుడు 1826లో తన భార్య మరణించింది. జడ్సన్ బైబిల్ విశ్వాసాలను ప్రతిధ్వనించే సంప్రదాయాలతో కూడిన మైనారిటీ సమూహం అయిన కరెన్ ప్రజల మధ్య తన పనిని విస్తరించాడు. ఈయన మాజీ బందిపోటు కోథాబైకు బాప్టిస్మము చ్చాడు, చివరకు అక్కడ ప్రజలలో మక్కువగల సువార్తికుడు అయ్యాడు. మొదటగా జడ్సన్ కొత్త నిబంధనను అనువదించాడు. 1834లో, తన 24-సంవత్సరాల సుదీర్ఘ పనిని పూర్తి చేసి, మొత్తం బైబిల్‌ను బర్మీస్‌లోకి అనువదించాడు, తన మిషన్‌లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచాడు.
జడ్సన్ ఊపిరితిత్తుల వ్యాధి వలన, దశాబ్దాల తీవ్రమైన మిషనరీ పని తర్వాత ఆరోగ్యం క్షీణించింది. ఈయన కోలుకోవడానికి స్వచ్ఛమైన గాలి సహాయం చేస్తుందని సముద్రయానం చేయమని సిఫార్సు చేయబడగా, ఈయనకు 61 సంవత్సరాల వయస్సులో ఐల్ ఆఫ్ బోర్బన్ కి వెళ్లే ఓడలో ప్రయాణిస్తుండగా, ఓడలోనే తన ప్రయాణమును ముగించి ప్రభువు వద్దకు పయనమైరి. మసాచుసెట్స్‌లోని ప్లైమౌత్‌లోని బరియల్ హిల్‌పై జడ్సన్ స్మారక చిహ్నం నిర్మించబడింది. ఈయన జీవితం తరువాతి తరాల మిషనరీలకు ప్రేరణగా, గౌరవార్థంగా అనేక మిషన్ క్షేత్రాలు, సంఘాలు, సెమినరీలకు ఈయన పేరుతో పిలవబడ్డాయి.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.