
ఈ రోజు బహు ప్రసిద్ధి చెందిన ఆంగ్ల గీతం “ద సాలిడ్ రాక్” రచయిత ఎడ్వర్డ్ మోటే గారు పరలోక పిలుపు అందుకున్న రోజు (13.11.1874)
ఇంగ్లాండ్ లోని లండన్ లో ప్రభువునెరుగని తల్లిదండ్రులకు జన్మించిన ఎడ్వర్డ్ మోటే గారు 18 సంవత్సరాల వరకు బైబిల్ గురించి గానీ, క్రీస్తు గురించి గానీ ఎటువంటి జ్ఞానం లేకుండా పెరిగాడు. 18వ ఏట క్రీస్తును గురించిన సువార్త విని బాప్తిసం పొందాడు.
లండన్ లో 37 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మోటే తన 55వ ఏట 1852లో దేవుని పిలుపుకు లోబడి ఒక బాప్టిస్ట్ ప్రసంగికునిగా మారాడు. హర్షోం లోని రెహబోత్ బాప్టిస్ట్ చర్చ్ లో పాస్టర్ గా పనిచేశారు. సంఘ సభ్యులందరూ ఆయనను ఎంతో ప్రేమించేవారు అంతేకాకుండా సంఘ భవనాన్ని ఆయనకు బహుమతిగా ఇవ్వాలని తలంచారు అయితే మోటే —”నాకు భవనం వద్దు. నాకు పుల్ పీట్ చాలు. ఎప్పుడైతే అక్కడ నుంచి క్రీస్తుని ప్రకటించడం మానేస్తానో, అప్పుడు ఆ పులిపీట్ కూడా నా దగ్గర నుంచి దూరం చేయండి” అనేవాడు. 1834లో లండన్ లో ప్రభు పర్వత ప్రబోధంలోని బండమీద, ఇసుకలో తమ ఇళ్ళు కట్టుకున్న బుద్ధిమంతుడు, బుద్ధిహీనుల ఉపమానాన్ని ఆధారంగా చేసుకుని ప్రఖ్యాతినొందిన “ఆన్ క్రైస్ట్ ద సాలిడ్ రాక్ ఐ స్టాండ్” అనే ఆంగ్ల సువార్త గీతాన్ని రాశారు. ఈయన కలం నుంచి వెలువడిన సుమారు 100 పాటలను (హిమ్స్ ఆఫ్ ప్రైజ్) స్తుతి కీర్తనలు పేరుతో ప్రచురించారు.
ఎడ్వర్డ్ మోటే గారు తన 77వ ఏట 1874 నవంబర్ 13న మరణించారు. లండన్ లోని తన సంఘం రెహబోత్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో సమాధి చేయబడ్డారు.