నేటి విశ్వాస నాయకురాలు
అడా రూత్ హబెర్ షన్
పరలోక పిలుపు : 01 ఫిబ్రవరి 1918
బోదకురాలు, సువార్తికురాలు, పుస్తక & గీత రచయిత, వేదాంతవేత్త, గాయని.

అడా రూత్ హబెర్ షన్ (1861-1918) ఒక బ్రిటీష్ గీత రచయిత, ముఖ్యంగా క్రైస్తవ సువార్త కీర్తనలకు ఈమె చేసిన కృషికి చాలా గొప్పది. ఇందులో “వృత్తం విడదీయబడుతుందా?”, బైబిల్ అధ్యయనం, క్రైస్తవ సాహిత్యంలో ఈమె చేసిన సేవకు, అనేక కీర్తనలు వ్రాసినందుకు బాగా గుర్తుండిపోయింది. ఈమె బైబిల్ సొసైటీ యొక్క పనిలో కూడా పాల్గొంది, అంతే కాకుండా లోతైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి, క్రైస్తవ పరిచర్య పట్ల నిబద్ధతకు ప్రసిద్ది చెందింది. ఈమె వేదాంతపరంగా, లేఖనాల విభాగింపు, ముఖ్యంగా పాత, కొత్త నిబంధనల మధ్య సంబంధాలను బోధించడంలో గౌరవించబడింది. ఈమె రచనలు తరచుగా దేవునిపై విశ్వాస స్థిరత్వం యొక్క ఇతివృత్తాలను నొక్కిచెప్పాయి. ఈమె మెట్రోపాలిటన్ చర్చికి వెళుతున్నప్పుడు పాస్టరు చార్లెస్ స్పర్జన్ ద్వారా, D.L. మూడీ ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందిరి. D.L. మూడీ మళ్లీ కలసినప్పుడు 1892 కెస్విక్ కన్వెన్షన్ లో పాత నిబంధనపై ప్రసంగాలు చెయ్యటానికి, ప్రత్యేక అభ్యర్థన మేరకు ఈమె యునైటెడ్ స్టేట్స్ను సందర్శించెను. అక్కడే కొంతకాలం ఆయన దగ్గర పరిచర్య చేసితిరి. 1912లో, ఈమె స్త్రీల కొరకు ప్రవచనాలను శోధించి తెలుసుకోవటానికి ఒక సంస్థను స్థాపించెను, కావున స్త్రీల మధ్య పరిచర్యలో కూడా పేరు గాంచిరి. ఈమె అక్కడే మరణించే వరకు దాని గౌరవ కార్యదర్శిగా పనిచేసిరి.

హబెర్ షన్ 1861 జనవరి 8న ఇంగ్లండ్లోని మేరిల్ బోన్ లో జన్మించెను, హబెర్ షన్ తండ్రి శామ్యూల్ ఒస్బోర్న్ హబెర్ షన్ ఒక ప్రముఖ వైద్యుడు, తల్లి గ్రేస్, వీరికున్న నలుగురు పిల్లలలో చిన్నదిగా క్రైస్తవ కుటుంబములో పెంచబడెను. వీరు ప్లైమౌత్ బ్రదరన్ ఉద్యమంలో భాగమయ్యారు, పాస్టర్ చార్లెస్ స్పర్జన్ సన్నిహిత కుటుంబ స్నేహితుడుగా, మెట్రోపాలిటన్ టాబర్నాకిల్లో క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్తుండేవారు. ఈమె చదువు అనంతరము, క్రైస్తవ పరిచర్యకు తనను తాను సమర్పించుకొనెను, పేద పిల్లలకు సేవ చేస్తూ, D L. మూడీ, సాంకీలను లండన్లో వారి సువార్త మిషన్లో కలుసుకున్నారు, అక్కడ ఈమె సాంకీతో కలిసి రెండు పాటలు పాడింది. ఈమె తల్లిదండ్రుల మరణాల తరువాత, ఈమె 1890ల ప్రారంభంలో రాయల్ నేషనల్ మిషన్ టు డీప్ సీ ఫిషర్మెన్లో చేరింది మరియు లండన్ YWCAకి ఆర్థిక కార్యదర్శిగా పనిచేసింది, వారి ప్రధాన కార్యాలయ నిర్మాణానికి నిధులను సేకరించింది.

1890లలో, హబెర్ షన్ బైబిల్పై రాయడం, బోధించడం ప్రారంభించెను. 1895లో, అమెరికన్ పర్యటనలో నార్త్ఫీల్డ్ సెమినరీ, మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్, మూడీ చర్చ్లలో బోధించెను. ఈమె ఉపన్యాసాలు 1898లో పాత నిబంధన ప్రత్యేకతగా ప్రచురించబడ్డాయి. ఈమె అమెరికన్ పర్యటన తరువాత, హబెర్ షన్ ప్రత్యేకంగా నియమించబడిన మోడల్ను ఉపయోగించి, టాబర్నాకిల్పై దృష్టి సారించి, ప్రయాణ బోధనా సువార్తను కొనసాగించింది. అయితే, అనారోగ్యం ఈమెను రచనపై దృష్టి పెట్టేలా చేసింది. బైబిల్ బోధలపై అనేక పుస్తకాలను రచించింది, పాత నిబంధన సంఘటనలు క్రీస్తు పనిని ఎలా సూచిస్తాయో అన్వేషించింది. ఈమె ఉపమానాలు, యేసు యొక్క అద్భుతాలు, ప్రకటన పుస్తకం వంటి అంశాలపై కూడా రాసింది. ఈ పుస్తకాలు మంచి ఆదరణ పొందాయి. ఈ రచనలు చర్చ్మన్, ది ఎక్స్పోజిటరీ టైమ్స్ వంటి గౌరవనీయమైన పత్రికలలో సమీక్షించబడ్డాయి. ఈమె కాలంలోని చాలా మంది మహిళా రచయితల మాదిరిగా కాకుండా, ఎప్పుడూ తన పేరుతోనే ప్రచురించింది. ఇంకా 1901లో కీర్తనలు రాయడం ప్రారంభించింది, చార్లెస్ M. అలెగ్జాండర్, జాన్ విల్బర్ చాప్మన్లతో సహా సువార్త ప్రచారాల కోసం దాదాపు వెయ్యి కీర్తనలను అందించింది. 1907లో, రాబర్ట్ హార్క్నెస్తో కలిసి పన్నెండు పవిత్ర పాటలను ప్రచురించింది.

హబెర్ షన్ 57 సంవత్సరాల వయస్సులో మేరిల్ బోన్లో కన్నుమూశారు. ఈమె ఆత్మకథ, ఎ గాథరర్ ఆఫ్ ఫ్రెష్ స్పాయిల్స్ అనే ఈమె సోదరిచే వ్రాయబడి, 1918లో ప్రచురించబడింది. ఈమె రచనలు క్రైస్తవ లోకంకు వేదాంతపరమైన పునాది. విశ్వాసము, భక్తి వ్యక్తీకరణ అందించడం ద్వారా స్ఫూర్తినిస్తున్నాయి.

Leave a comment