శామ్యూల్ మరినస్ జ్వెమర్ (1867–1952) "ఇస్లాంపై అపొస్తలుడు"గా ప్రసిద్ధి చెందారు. ఇస్లాం మతానికి అపోస్తలుడు, సువార్తికుడు, మిషనరీ, పండితుడు, వేదాంతవేత్త, రచయిత.

నేటి విశ్వాస నాయకుడు
శామ్యూల్ మారినస్ జ్వెమర్
పరలోక పిలుపు : 2 ఏప్రిల్ 1952
ఇస్లాం మతానికి అపోస్తలుడు, సువార్తికుడు, మిషనరీ, పండితుడు, వేదాంతవేత్త, రచయిత.

శామ్యూల్ మరినస్ జ్వెమర్ (1867–1952) “ఇస్లాంపై అపొస్తలుడు”గా ప్రసిద్ధి చెందారు. ఈయన మధ్యప్రాచ్యంలో ముస్లింలకు సువార్త ప్రకటించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన అమెరికన్ మిషనరీ. 1889లో అమెరికన్ అరేబియన్ మిషన్ను స్థాపించి, అరేబియా, బహ్రైన్, ఈజిప్ట్, ఇరాక్ వంటి ప్రదేశాలలో 1929 వరకు సువార్త వ్యాప్తికి కృషి చేశారు. బహ్రైన్ లో అమెరికన్ మిషన్ ఆసుపత్రిని స్థాపించారు. 1930-1937 వరకు ప్రిన్స్టన్ థియోలాజికల్ సెమినారీలో ప్రొఫెసర్గా, తన శక్తివంతమైన ఉపన్యాసాలతో వేల మందిని మిషనరీ సేవలోకి రప్పించారు. జ్వీమర్ మిషనరీ సేవకు అనేక క్రైస్తవులను ప్రేరేపించి, మోస్లేమ్ వరల్డ్ అనే పత్రికను 35 సంవత్సరాలు సంపాదకత్వం వహించారు. ఈయన సిద్ధాంతం, దేవుని సర్వాధిక్యతను, త్రిత్వమును పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈయన మిషనరీ లక్ష్యం దేవుని మహిమను ప్రకటించడమే అని విశ్వసించారు. అనేక వ్యక్తిగత నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, సువార్త విజయం మీద ఉన్న విశ్వాసం అచంచలంగా నిలిచింది. మిషనరీ విధానంలో క్రైస్తవ ఏకత్వాన్ని ప్రోత్సహించినా, ముఖ్యమైన బైబిలు సత్యాల విషయంలో రాజీ పడలేదు. తక్కువమంది మాత్రమే క్రీస్తును స్వీకరించినా, ఈయన ముఖ్యమైన ప్రభావం ముస్లింల మధ్య క్రైస్తవ మిషనరీ ప్రచారాన్ని ప్రేరేపించడమే.

జ్వెమర్ 1867 ఏప్రిల్ 12న మిచిగన్లోని వ్రీస్లాండ్లో జన్మించారు. విద్యాబ్యాసమంతయు ముగించుకొని, సెమినారీలో ఉన్నప్పుడే మిషనరీ పిలుపు బలంగా ఏర్పడింది. 1890లో రెఫార్మ్డ్ చర్చిలో అర్చకుడిగా అంకితమై, తరువాత మిషనరీగా మిడిల్ ఈస్ట్ లో సేవలందించారు. హోప్ కాలేజీ (1904), ముస్కింగమ్ కాలేజీ (1918), రుట్గర్స్ కాలేజీ (1919) నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

జ్వెమర్ సేవ మూడు ప్రధానాంశాలపై కేంద్రీకృతమైంది—సువార్తిక కార్యం, రచన, మిషనరీ నియామకం. ఈయన ప్రాముఖ్యంగా గ్రంథాల ప్రచురణ, వ్యక్తిగత సంభాషణల ద్వారా సువార్తను వ్యాప్తి చేశారు. కఠినమైన వాదనతో పాటు, ప్రేమతో క్రీస్తును పరిచయం చేయడంలో సమతుల్యంగా వ్యవహరించారు. అమెరికన్ క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ ఫర్ ముస్లింస్ సంస్థను నడిపి, క్రైస్తవ ప్రచురణలకు విస్తృతంగా ప్రచురించారు. ఆయన సేకరించిన నిధులు రెఫార్మ్డ్ బోర్డ్ ఆఫ్ ఫారిన్ మిషన్స్కు మద్దతునిచ్చాయి.

తన 84 సంవత్సరాల వయస్సులో, 85వ పుట్టినరోజుకు పది రోజుల ముందే న్యూయార్క్లో తుదిశ్వాస విడిచారు. ఈయన సేవ నుండి విరమించినప్పటికీ, చివరి వరకు ఇస్లాం, క్రైస్తవ మిషనరీ విధానం గురించి రాస్తూ, బోధిస్తూ కొనసాగారు.

Leave a comment