ఎలిజబెత్ ఈవర్ట్స్ గ్రీన్ (1920-1997) బెట్టీ గ్రీన్ అని పిలుస్తారు, మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకురాలు, సువార్తికురాలు, స్క్రిప్ట్ అనువాదకురాలు, సంక్షోభంలో స్పందకురాలు.

నేటి విశ్వాస నాయకురాలు
బెట్టీ గ్రీన్
పరలోక పిలుపు : 10 ఏప్రిల్ 1997
మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకురాలు, సువార్తికురాలు, స్క్రిప్ట్ అనువాదకురాలు, సంక్షోభంలో స్పందకురాలు.

ఎలిజబెత్ ఈవర్ట్స్ గ్రీన్ (1920-1997) బెట్టీ గ్రీన్ అని పిలుస్తారు, అమెరికన్ పైలట్, మిషనరీ, ఈమె మొదటి MAF పైలట్, క్రైస్తవ మిషన్లకు మద్దతుగా విమానయానాన్ని ఉపయోగించడం, మిషనరీలను రవాణా చేయడం, వైద్య సామాగ్రి, మారుమూల ప్రాంతాలకు సహాయం చేయడం కోసం ఈమె జీవితాన్ని అంకితం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, సైనిక విమానాలను నడిపేందుకు శిక్షణ తీసుకొని, మహిళా ఎయిర్ఫోర్స్ సర్వీస్ పైలట్స్ (WASP)లో పైలట్గా పనిచేసింది, ఈమె 1946లో వాకో UPF-7 బైప్లేన్ లో మెక్సికోలోని మారుమూల అడవికి ఇద్దరు విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ మిషనరీలను తీసుకు వెళ్లింది. ఆ సంవత్సరం తర్వాత, దక్షిణ అమెరికాలోని మిషనరీలకు సామాగ్రిని అందజేస్తూ ఆండీస్ పర్వతాలను దాటిన మొదటి మహిళా పైలట్గా ఈమె చరిత్ర సృష్టించింది. ఈమె దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా అంతటా క్రైస్తవ మిషన్ల కోసం సేవ చేసిరి. రిమోట్ కమ్యూనిటీలకు సహాయం చేసిరి. ఈమె పని సువార్తను వ్యాప్తి చేయడం, మానవతా మిషన్లకు మద్దతు ఇవ్వడంలో విమానయానం పోషించగల శక్తివంతమైన పాత్రను ప్రదర్శించింది. ఈమె 2017లో ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్ పయనీర్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించింది. ఇది విమానయాన రంగంలో మహిళలు చేసిన గణనీయమైన కృషికి గౌరవ పురస్కారం, ఇది క్రైస్తవ మిషనరీ రంగానికీ కూడా గౌరవవంతమైన గుర్తింపు నిచ్చెను.

గ్రీన్ జూన్ 24, 1920న అమెరికాలోని వాషింగ్టన్, సీటెల్ లో జన్మించింది. ఈమె తన విశ్వాసాన్ని పెంపొందించే భక్తుడైన ప్రెస్బిటేరియన్ కుటుంబంలో పెరిగింది. ఏరోనాటికల్ రంగంలో చదువుతూ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చేరింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, మహిళా ఎయిర్ఫోర్స్ సర్వీస్ పైలట్స్ (WASP)లో చేరింది, అక్కడ సైనిక పైలట్గా శిక్షణ పొంది, WASP పైలట్గా, రవాణా విమానాలతో సహా సైనిక విమానాలను నడిపింది, దీనితో విలువైన విమాన అనుభవాన్ని పొందింది. ఈమె అనుభవాలు మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ లో ఈమె పాత్రకు సిద్ధం చేసి, తన నైపుణ్యాలను మిషనరీ పని కోసం ఉపయోగించింది.

ఈమె పరిచర్య మిషనరీ సేవకు మద్దతుగా విమానయానాన్ని ఉపయోగించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుదూర, ఏకాంత కమ్యూనిటీలకు సువార్తను వ్యాప్తి చేయడంలో విమానాలు సహాయపడతాయని ఈమె బలంగా నమ్మి, ఇతర క్రైస్తవ పైలట్ లతో కలిసి మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ (MAF)ని స్థాపించింది. మిషనరీలు, బైబిల్ అనువాదకులు, వైద్య బృందాలు, మానవతా సహాయానికి సురక్షితమైన, సమర్థవంతమైన విమాన రవాణాను అందించడం వీరి లక్ష్యం. ఈమె దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మరియు పసిఫిక్లలో ప్రయాణించి, పెరూ, నైజీరియా, పాపువా న్యూ గినియా వంటి దేశాలలో సేవలందించింది. ఈమె పని బైబిల్ అనువాదం, వైద్య మిషన్లు, విపత్తు సహాయక చర్యలకు మద్దతు ఇచ్చింది.

పైలట్ గా బాధ్యతలు ముగించిన తర్వాత గ్రీన్, మిషనరీ ఏవియేషన్ కోసం వాదించడం, కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వడం కొనసాగించెను . ఈమె మరణించినా, MAF సువార్తతో మారుమూల ప్రాంతాలకు చేరుకోవడంతో నేటికీ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నది.

జాన్ మైఖేల్, రాజమండ్రి.

Leave a comment