మన విధి!
మన విధి! ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.—ప్రసంగి 12:13 అసలు మనిషి దేవునికి ఎందుకు భక్తి చేయాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు విధేయుడు కావాలి? ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మనం ఆయన సృజించిన జీవులం కనుక. దేవుడు ఉంటే ఆయన సర్వానికీ సృష్టి కర్తే! సర్వ జీవులూ ఆయన వారే! భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే…