దైవ దూషణ నెపంతో 70ఏళ్ల క్రైస్తవునిపై దాడి, ఇంటికి నిప్పు
పాకిస్తాన్‌లోని సర్గోధా నగరంలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో అల్లరి మూక ఒక 70 ఏళ్ల క్రైస్తవుడిపై దాడి చేసింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో బాధితుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు కూడా ఉన్న ఆ గుంపు బాధితుడి ఇల్లు మరియు షూ ఫ్యాక్టరీని తగులబెట్టింది. దాడి చేస్తున్నవారు బాధితుల వస్తువులను దొంగిలించడాన్ని సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూపిస్తున్నాయి.
ప్రభుత్వాలన్నీ దేవుడివే
ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.