1895 మార్చి 13

రాబర్ట్ విలియం డేల్ (1829–1895) బర్మింగ్హామ్లో ఉన్న ఒక ప్రభావవంతమైన ఇంగ్లీష్ కాంగ్రెగేషనల్ చర్చి నాయకుడు. ఈయన 1853లో కార్స్ లేన్ చాపెల్ కు సహ-పాస్టర్, తరువాత దాని ఏకైక పాస్టర్ అయ్యాడు. డేల్ సాంఘిక సంస్కరణలు, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ స్థాపన కోసం వాదిస్తూ, పౌర జీవితంలో లోతుగా నిమగ్నమయ్యాడు. ఈయన 1870 నాటి ఫోర్స్టర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చట్టమును రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. నాన్ కాన్ఫార్మిస్ట్ సూత్రాలకు అనుగుణంగా లౌకిక విద్యకు మద్దతు ఇచ్చాడు. వేదాంతవేత్తగా, రచయితగా, ఈయన “ది అటోన్మెంట్” (1875)లో రాశాడు, దేవుడు, మానవాళి మధ్య సయోధ్యకు మార్గంగా క్రీస్తు మరణాన్ని నొక్కి చెప్పాడు. ఈయన బోధనలు సివిక్ గోస్పెల్ను ప్రతిబింబిస్తాయి, ఇది సామాజిక సమస్యలను పరిష్కరించడంలో చర్చి పాత్రను ప్రోత్సహించింది.

1895 March 13

Robert William Dale (1829–1895) was an influential English Congregational church leader based in Birmingham. He became co-pastor of Carr’s Lane Chapel in 1853 and later its sole pastor. Dale was deeply involved in civic life, advocating for social reforms and the disestablishment of the Church of England. He played a key role in shaping the Forster Elementary Education Act of 1870, supporting secular education in line with Nonconformist principles. As a theologian and author, he wrote “The Atonement” (1875), emphasizing Christ’s death as a means of reconciliation between God and humanity.

alfred-saker

1880 మార్చి 12

ఆల్ఫ్రెడ్ సేకర్ (1814-1880) ఆఫ్రికాలోని కామెరూన్‌లో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఈయన బాప్టిస్ట్ మిషనరీ సొసైటీతో అనుబంధం కలిగి, పశ్చిమ ఆఫ్రికాలో సువార్త ప్రచారం, అనువాదం, క్రైస్తవ సంఘాలను స్థాపించడంలో ఈయన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఈయన కేవలం “మిషనరీ టు ఆఫ్రికా” అని పిలవబడాలని ఇష్టపడ్డాడు. 1858లో, ఈయన స్పానిష్ ద్వీపం ఫెర్నాండో పో నుండి దక్షిణ కామెరూన్ కు ఒక మిషన్‌కు నాయకత్వం వహించాడు, అక్కడ బింబియా చీఫ్‌ల నుండి భూమిని కొనుగోలు చేసి, విక్టోరియాను స్థాపించాడు, తరువాత 1982లో లింబేగా పేరు మార్చాడు. ఈయన, ఫెర్నాండో పో కామెరూన్‌లో బాప్టిస్ట్ చర్చిలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు.

alfred-saker

1880 March 12

Alfred Saker (1814-1880) was a British missionary who played a key role in spreading Christianity in Cameroon, Africa. He was associated with the Baptist Missionary Society and is best known for his efforts in evangelism, translation, and establishing Christian communities in West Africa. He preferred to be known simply as a “Missionary to Africa”. In 1858, he led a mission from the Spanish island of Fernando Po to Southern Cameroons, where he purchased land from Bimbia chiefs and founded Victoria, later renamed Limbe in 1982.

1897 మార్చి 11

హెన్రీ డ్రమ్మండ్ (1851-1897) స్కాటిష్ సువార్త ప్రచారకుడు. ఈయన క్రైస్తవ పరిచర్య, జీవ శాస్త్రవేత్తగా రెండింటిలోనూ తన అంకితమైన పనికి ప్రసిద్ధి చెందాడు. ఈయన D L మూడీతో సన్నిహిత సంబంధం కలిగి, సువార్త ప్రచారాలలో సహాయం చేసేవాడు. డ్రమ్మండ్ యొక్క అత్యంత ప్రసిద్ధ రచన, “ది గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్, ఒక భక్తి క్లాసిక్”, ఇది 1 కొరింథి 13 ప్రకారము, అత్యున్నత క్రైస్తవ ధర్మంగా ప్రేమను నొక్కి చెబుతుంది. ఈయన రచనలు, సువార్త ప్రచారం, ఉపన్యాసాల ద్వారా క్రైస్తవ మతానికి గణనీయమైన కృషి చేసాడు, ముఖ్యంగా ప్రేమ, విశ్వాసం, సైన్స్, మతం వీటిమధ్య సంబంధమును, సామరస్యాన్ని నొక్కి చెప్పాడు.

1897 March 11

Henry Drummond (1851–1897) was a Scottish evangelist, writer, and Biologist known for his work in both Christian ministry and natural science. He was closely associated with Dwight L. Moody, assisting in his evangelistic campaigns. Drummond’s most famous work, “The Greatest Thing in the World, is a devotional classic”, that explores 1 Corinthians 13, emphasizing love as the highest Christian virtue. He made significant contributions to Christianity through his writings, evangelism, and lectures, particularly emphasizing love, faith, and the harmony of science and religion.

1898 మార్చి 10

జార్జ్ ముల్లర్ (1805-1898) గొప్ప క్రైస్తవ మత ప్రచారకుడు, ఇంగ్లాండ్, బ్రిస్టల్లో యాష్లే డౌన్ అనాథాశ్రమ స్థాపకుడు. ఈయన దేవుని ఏర్పాటుపై అచంచలమైన విశ్వాసానికి ప్రసిద్ధి గాంచాడు. ఎప్పుడూ విరాళాల మీద ఆధారపడలేదు, కానీ వేలాది మంది అనాథల అవసరాలను తీర్చడానికి ప్రార్థనపై మాత్రమే ఆధార పడేవాడు. తన జీవితకాలంలో, ముల్లర్ 10,024 మంది అనాథలను చూసుకున్నాడు. ఈయన 117 పాఠశాలలను స్థాపించాడు, ఇవి 120,000 కంటే ఎక్కువ మంది క్రైస్తవ విద్యను అందించాయి. ఈయన ప్లైమౌత్ బ్రదర్న్ ఉద్యమ స్థాపకులలో ఒకడు. తరువాత విభజన సమయంలో, ఈయన బృందాన్ని ఓపెన్ బ్రదరెన్ అని పిలిచారు.

1898 March 10

George Muller (1805–1898) was a Christian evangelist and the founder and director of Ashley Down orphanage in Bristol, England. He is best known for his unwavering faith in God’s provision, never soliciting donations directly but relying solely on prayer to meet the needs of thousands of orphans. Throughout his lifetime, Müller cared for over 10,024 orphans. He established 117 schools which offered Christian education to more than 120,000. He was one of the founders of the Plymouth Brethren movement. Later during the split, his group was called the Open Brethren.

1892 మార్చి 08

జేమ్స్ కేల్వెర్ట్ (1813–1892) ఫిజీ దీవుల్లో దైర్యంగా క్రైస్తవ్యమును వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఆ కాలములో, ఫిజీ హింసాత్మక గిరిజన యుద్ధానికి, నరమాంస భక్షకానికి ప్రసిద్ధి చెందింది. ప్రజలకు సువార్తను పరిచయం చేయడానికి కేల్వెర్ట్ అంకితభావంతో, చాలా ధైర్యంగా సేవచేశాడు. శత్రుత్వం, అనారోగ్యం, తన ప్రాణాలకు బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ, ఈయన ప్రభువు పిలుపులో స్థిరంగా ఉన్నాడు. 1854లో నరమాంస భక్షణను త్యజించి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి శక్తివంతమైన ఫిజియన్ చీఫ్ రతు సెరు ఎపెనిసా కాకోబౌను ప్రభావితం చేయడం ఈయన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. 1872లో ఫిజీని విడిచిపెట్టిన తర్వాత, ఈయన తన చివరి సంవత్సరాల వరకు ఆఫ్రికాలో తన మిషనరీ పనిని కొనసాగించాడు.

1892 March 08

James Calvert (1813–1892) was a devoted British Methodist missionary who played a crucial role in spreading Christianity in Fiji. At the time, Fiji was known for its violent tribal warfare and cannibalism. Calvert worked courageously to introduce the gospel to the people. Despite facing hostility, illness, and threats to his life, he remained steadfast in his calling. One of his most significant achievements was influencing Ratu Seru Epenisa Cakobau, a powerful Fijian chief, to renounce cannibalism and embrace Christianity in 1854. After leaving Fiji in 1872, he continued his missionary work in Africa till his last years.