
ఈ రోజు యువరాజు కాన్‌స్టాంటైన్-కాఖీ ఇస్లాం మతం స్వీకరించడానికి తిరస్కరించి హతసాక్షియైన రోజు (10-11-852).
9వ శతాబ్దం జార్జియన్ చరిత్రలో అత్యంత కష్టమైన కాలాలలో ఒకటి. అరబ్ ముస్లింలు కార్ట్లీ ప్రాంతం అంతటా విధ్వంసం సృష్టించారు, అనేక మందిని బలవంతంగా కత్తితో బెదిరించి ఇస్లాంలోకి మార్చారు. చాలామంది నిరాశ్రయులు మరియు భయాందోళనలకు గురైనవారు తమ విశ్వాసాన్ని తాకట్టు పెట్టేందుకు శోధించబడ్డారు. ఆ సమయంలో ధైర్యవంతుడు మరియు నమ్మకమైన క్రైస్తవుడు, రాజ కుమారుడు కాన్‌స్టాంటైన్, కార్ట్లీలో నివసిస్తున్నాడు. అతను కఖేటియన్ రాకుమారుల వారసుడు, అందుకే అతని పేరుతో పాటు కాఖీ అని సంబోధించబడతాడు. కాన్‌స్టాంటైన్-కాఖీ ఇస్లాం ధర్మం స్వీకరించడానికి నిరాకరించాడని సమర్రా పట్టణ ఖలీఫా జాఫర్ అల్ ముతవాకిల్ (847–861) వద్దకు పంపారు.
జాఫర్ అతన్ని గౌరవంగా స్వీకరించి, తన క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టమని మరోసారి ప్రతిపాదించాడు. దేవుని కృపతో బలపడిన ధైర్యవంతుడైన యువరాజు ధైర్యంగా ఇలా అన్నాడు—“నీ కత్తి నన్ను భయపెట్టదు. నా ఆత్మను, శరీరాన్ని నాశనం చేయగల, పునరుత్థానం చేయగల మరియు చంపగల శక్తి ఉన్నవాడికి నేను భయపడుతున్నాను, కారణం ఆయనే నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన సార్వభౌమాధికారి, ప్రపంచానికి పాలకుడు మరియు అన్ని యుగాలకు తండ్రి!”
ఆ సమాధానంతో కోపోద్రిక్తుడైన ఖలీఫా, సెయింట్ కాన్‌స్టాంటైన్-కాఖీని శిరచ్ఛేదనం చేయాలని ఆదేశించాడు. మోకాళ్లపై వంగి తుది ప్రార్థన చేసుకున్న సెయింట్ కాన్‌స్టాంటైన్-కాఖీ నవంబర్ 10, 852న హతసాక్షి అయ్యారు. క్రైస్తవ విశ్వాసులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఆయన శరీరాన్ని ఎత్తైన స్తంభానికి వేలాడదీశారు. తరువాత దానిని ఖననం చేయడం జరిగింది.