ఈ రోజు ప్రఖ్యాత క్రైస్తవ అపాలజిస్ట్, తాత్వికుడు విలియం పేలీ అమెరికాలోని లింకన్షైర్ లో పరమపదించిన రోజు. ప్రకృతిలో ఉన్న నిర్మాణ క్రమం ఆధారంగా ఇతడు ఆస్తిక సమర్థనా వాదాన్ని రూపొందించాడు. మానవ శరీర నిర్మాణంలోని సంక్లిష్టత, విశ్వంలోని నిర్మాణ సంక్లిష్టత దేవుని ఉనికిని నిరూపించే సిద్ధాంతాలను సూత్రీకరించాడు పేలీ. ఈయన సూత్రీకరించిన “గడియారం—నిర్మాణకుడు” ఉదాహరణ విశ్వ విఖ్యాతమయ్యింది.