Courtesy: Mob attacked a Christian in Pakistan

పాకిస్తాన్‌లోని సర్గోధా నగరంలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో అల్లరి మూక ఒక 70 ఏళ్ల క్రైస్తవుడిపై దాడి చేసింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో బాధితుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు కూడా ఉన్న ఆ గుంపు బాధితుడి ఇల్లు మరియు షూ ఫ్యాక్టరీని తగులబెట్టింది. దాడి చేస్తున్నవారు బాధితుల వస్తువులను దొంగిలించడాన్ని సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూపిస్తున్నాయి.

ఈ దాడిలో మరో ఐదుగురు క్రైస్తవులు కూడా గాయపడ్డారని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, స్థానిక క్రైస్తవులను సురక్షిత ప్రదేశాలకు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ తరహా గుంపుల నుండి క్రైస్తవులు తీవ్ర ప్రమాదంలో ఉన్నారని పాకిస్తాన్‌లోని మానవ హక్కుల కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
పాకిస్తాన్‌లో దైవదూషణ పేరు మీద క్రైస్తవులపై హింస సర్వసాధారణం అయిపోయింది.