ఇంగ్లాండ్ లోని బెరీ నగరంలో యౌవనస్తుడైన జేమ్స్ ఏబ్స్ హత సాక్షి యైన రోజు ఈ రోజు. మత సంస్కరణ భావాలున్న జేమ్స్ ను దైవ దూషణ పేరుతో అరెస్టు చేశారు. తన భావజాలాన్ని విడిచిపెట్టాలని కొంత ధనాన్ని ఇవ్వచూపినా, తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని ధైర్యంగా బిషప్ కి చెప్పినప్పుడు, ఆయనకు మరణ శిక్ష విధించారు.
ఆయన చేతులు కట్టి, గుంజ దగ్గర నిలువబెట్టి, వస్త్రాలు తీసివేసి నిప్పు అంటించారు. అందరూ చూస్తుండగా దేవుని స్తుతిస్తూ, సత్య సువార్తను అరచి చెప్తూ మంటలలో సజీవ దహనమయ్యారు జేమ్స్ ఏబ్స్.