
యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి సండే స్కూల్ మిషనరీ, రెవరెండ్ విలియం సి. బ్లెయిర్ తన పనిని ప్రారంభించిన రోజు ఈ రోజు(04-08-1821).
అతని మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు వందల మైళ్ళు, ఎక్కువగా గుర్రాలపై ప్రయాణించి, ఆరు రాష్ట్రాలను సందర్శించి, అరవై ఒక్క సండే స్కూల్ బృందాలను స్థాపించాడు. మరొక ముప్పై ఐదు గుంపులను బలపరిచాడు. నాలుగు వయోజన పాఠశాలలు మరియు ఆరు ట్రాక్ట్ సొసైటీలను స్థాపించాడు. తర్వాత తన వార్షిక నివేదికను అందజేసినప్పుడు, అనారోగ్యం కారణంగా ఎక్కువ పని చేయలేకపోయానని క్షమాపణలు చెబుతాడు. ఐతే అతని పరిచర్య విధానం సండే స్కూల్ మరియు అడల్ట్ స్కూల్ యూనియన్ లను ఎంతగానో ఆకట్టుకుంది.