
ఈరోజు ప్రముఖ విద్యా సంస్కరణ కర్త, ఆధునిక విద్యకు ఆద్యుడైన విద్యావేత్త, ఆధ్యాత్మిక వేత్త జాన్ ఆమోస్ కొర్మేనియస్ గారు పరమపదించిన రోజు (15.11.2024).
10 సంవత్సరాలప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఈయనను తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేరదీసి, తలాంతులను గుర్తించి పరిచర్యలో ప్రోత్సహించారు. 1616 లో బొహినియన్ బ్రదరన్ పరిచర్యకు నియమింపబడ్డాడు. 1618లో 30 సంవత్సరాల యుద్ధం సమయంలో అందరిని తిరిగి కేథలిక్లుగా మార్చాలన్న రాజాజ్ఞ ఇతర ప్రొటెస్టెంట్లతో కలిసి పోలండ్ దేశానికి పారిపోయేలా చేసింది. అందరు ప్రజలకు విద్య అందుబాటులో ఉండాలని, వారి సామాజిక పరిస్థితులు, స్త్రీ పురుషులు బేధం లేకుండా అందరూ చదువుకోవాలని ఈయన అభిప్రాయపడ్డాడు. మొట్టమొదటిసారిగా పాఠశాలకు పుస్తకాలను పరిచయం చేశాడు ఇంకా కొర్మేనియస్ పాఠశాల విద్యకు కావలసిన ప్రాథమిక అంశాలతో ఒక కరికులంను తయారు చేశాడు. పిల్లలకు బొమ్మలతో కూడిన టెక్స్ట్ బుక్స్ ను పరిచయం చేశాడు. విద్యలో భాషలను నేర్పించాలని, విద్యను, ఆటలను, సంగీతాన్ని కలిపి ధించడం, నైతిక, ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్పించడం వంటి నూతన అంశాలతో విద్యా స్కరణలను తీసుకువచ్చాడు.
ఈయన విద్య లో తీసుకున్న సంస్కరణలు క్రైస్తవ పరిచర్యలో ఉపయోగపడ్డాయి. విద్యను బోధిస్తూ తద్వారా దేవుని ప్రేమ తెలుసుకోవడానికి మార్గం సుగమం చేశాడు. అనేకమైన పాఠ్యపుస్తకాలను, పుస్తకాలను రాశారు.
ఈయన 1670లో తన 78వ ఏట ఆమ్ స్టర్ డం లో ప్రభుపిలుపు అందుకున్నారు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.