1892 మార్చి 08
జేమ్స్ కేల్వెర్ట్ (1813–1892) ఫిజీ దీవుల్లో దైర్యంగా క్రైస్తవ్యమును వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఆ కాలములో, ఫిజీ హింసాత్మక గిరిజన యుద్ధానికి, నరమాంస భక్షకానికి ప్రసిద్ధి చెందింది. ప్రజలకు సువార్తను పరిచయం చేయడానికి కేల్వెర్ట్ అంకితభావంతో, చాలా ధైర్యంగా సేవచేశాడు. శత్రుత్వం, అనారోగ్యం, తన ప్రాణాలకు బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ, ఈయన ప్రభువు పిలుపులో స్థిరంగా ఉన్నాడు. 1854లో నరమాంస భక్షణను త్యజించి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి శక్తివంతమైన ఫిజియన్ చీఫ్ రతు సెరు ఎపెనిసా కాకోబౌను ప్రభావితం చేయడం ఈయన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. 1872లో ఫిజీని విడిచిపెట్టిన తర్వాత, ఈయన తన చివరి సంవత్సరాల వరకు ఆఫ్రికాలో తన మిషనరీ పనిని కొనసాగించాడు.