దేవుడే దిగివస్తే ?!
ఇది కమ్యూనికేషన్ యుగం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉధృతంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో భూగోళం అవతలకు సందేశాలు పంపడమే కాదు అంగారకుని ఉపరితలం నుండి సంకేతాలు అందుకోవడమూ క్షణంలో పని. మనుషులతోనే కాదు గ్రహాంతర వాసులతో సైతం (అలాంటివారు ఉంటే) సంబంధాలు పెట్టుకోవాలన్న ఈ తపన మనిషికి సహజంగానే అబ్బిన గుణం. ‘మానవుడు సంఘజీవి’ అని అరిస్టాటిల్ అనడం సబబే అనిపిస్తుంది. అయితే మనిషిలోని ఈ సామాజిక తపన ఇక్కడితో ఆగిపోయింది అనుకుంటే పొరపాటే. తనకంటే ఉన్నతమైన దానితో…