దైవ దూషణ నెపంతో 70ఏళ్ల క్రైస్తవునిపై దాడి, ఇంటికి నిప్పు
పాకిస్తాన్‌లోని సర్గోధా నగరంలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో అల్లరి మూక ఒక 70 ఏళ్ల క్రైస్తవుడిపై దాడి చేసింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రి లో ఆందోళనకర పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో బాధితుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు కూడా ఉన్న ఆ గుంపు బాధితుడి ఇల్లు మరియు షూ ఫ్యాక్టరీని తగులబెట్టింది. దాడి చేస్తున్నవారు బాధితుల వస్తువులను దొంగిలించడాన్ని సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూపిస్తున్నాయి.
మతమార్పిడి కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు
శ్యామ్ హగ్గిన్బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్( SHUATS) వైస్ ఛాన్సలర్ ఐన రాజేంద్ర బిహారి లాల్ పై నమోదైన మత మార్పిడి నిరోధక కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు మే 17న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మత మార్పిడి నిరోధక చట్టం 2021 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ యూపి మత మార్పిడి నిరోధక చట్టం 2021 లోని కొన్ని అంశాలు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 25లో ఉన్న…
Read More