1492 ఆగస్ట్ 03

ప్రపంచ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ప్రఖ్యాత సాహస యాత్ర మొదలైన రోజు ఇది.
ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పడం కోసం బయలుదేరి, యాదృచ్చికంగా

1555 ఆగస్ట్ 02

ఇంగ్లాండ్ లోని బెరీ నగరంలో యౌవనస్తుడైన జేమ్స్ ఏబ్స్ హత సాక్షి యైన రోజు ఈ రోజు. మత సంస్కరణ భావాలున్న జేమ్స్ ను దైవ దూషణ పేరుతో అరెస్టు చేశారు.

1834 ఆగస్టు 01

బైబిలు గ్రంథాన్ని చైనా భాషలోకి అనువదించిన చైనా మిషనరీ రాబర్ట్ మోరిసన్ పరమపదించినరోజు ఈ రోజు. ఈ ఇంగ్లాండ్ దేశ పౌరుడు—తొలి ఇంగ్లీష్

జూన్ 24, 1455

నేడు జోహన్నెస్ గూటెన్‌బర్గ్ యొక్క జన్మదినం. జర్మనీ దేశానికి చెందిన గూటెన్‌బర్గ్ ప్రింటింగ్ ప్రెస్‌ను కనిపెట్టి ప్రసిద్ధి చెందారు. అందువలన పుస్తకాల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పుస్తకములు చౌకగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పునరుజ్జీవనోద్యమ కాలంలో జ్ఞాన వ్యాప్తిలో ప్రింటింగ్ ప్రెస్ కీలక పాత్ర వహించింది.

జూన్ 5, 1661

ఆంగ్ల గణిత, భౌతిక శాస్త్ర వేత్త ఐజాక్ న్యూటన్ ఈ రోజు కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో చేరాడు. ఐతే ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావిగా పేరు గాంచిన ఈ శాస్త్రవేత్త సైన్స్ కంటే థియాలజినే ఎక్కువ చదివాడు. బైబిల్ విషయాల పైన ఈయన 13 లక్షల పదాల సంపుటాలు రాశారు అన్నది విశేషం!

మే 30, 1431

ఈ రోజు ఫ్రెంచ్ సైనికాధికారి జోన్ ఆఫ్ ఆర్క్ ను పురుష వస్త్రాలు ధరిస్తుందన్న నెపంతో గుంజకు కట్టి సజీవ దహనం చేశారు. 1431 మార్చి నెలలోని విచారణలో ఆమె కేథోలిక సంఘ ఆచారాలను పాటించటం లేదని ఆమెపై మతభ్రష్ట కేసు నమోదు చేసి, ఇకపై ఎప్పుడూ స్త్రీ వేషధారణ లోనే ఉండాలని ఆజ్ఞాపించారు. ఆమె అందుకు ఒప్పుకుంది. ఐతే కొన్ని రోజుల తర్వాత మరల పురుష వేషం వేసిందన్న అభియోగంతో ఆమెను అధికారులకు అప్పగించి, మరణశిక్ష విధించారు.

1453, మే 29

రవి అస్తమించని రోమ్ సామ్రాజ్య కీర్తి శిఖరంలో మకూటయమానంగా ఉన్న
కాన్స్టాంటినోపుల్ మహా నగరం కుప్పకూలిన రోజు. నాటి రోమ్ సామ్రాజ్యాధినేత కాన్స్టెంటైన్ క్రీ.శ. 324లో స్థాపించిన రాజధాని నగరమిది. రెండో సుల్తాన్ మహమ్మద్ నాయకత్వంలోని ఒట్టోమన్ సైన్యం ఏప్రిల్ 6న ఈ నగరాన్ని ముట్టడి చేసింది. యుద్ధం యాభై మూడో రోజున, 1453 మే 29న శత్రు సైన్యం స్వాధీనం చేసుకోవడంతో ఈ నగర వైభవ చరిత్ర ముగిసిపోయింది.

మే 28, 1403

ఈరోజు జాన్ విక్లీఫ్ సిద్ధాంతాలను వ్యాపింప చేస్తున్న జాన్ హస్ మొదలైన వారికి జర్మన్ యునివర్సిటీ పండితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

మే 27, 1564

ఫ్రెంచ్ క్రైస్తవ వేదాంతి, క్రైస్తవ సంఘ సంస్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన మేధావి, కాల్వినిజంకు ఆద్యుడు జాన్ కాల్విన్ మహిమలోకి ప్రవేశించిన రోజు. దేవుని పనిలో అహర్నిశలు శ్రమించిన కాల్విన్ చివరిగా 1558లో జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. తన “ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలీజియన్”ను అనారోగ్యంలోనే పునర్విమర్శ చేసిన కాల్విన్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది. కొంతకాలం శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డ కాల్విన్ చివరికి తన యాభై నాల్గవ ఏట ప్రభువు పిలుపు అందుకున్నాడు. ప్రాటెస్టెన్ట్ క్రైస్తవ ఆలోచన పైన కాల్విన్ చెరగని ముద్ర వేశాడు.

మే 26, 1521

జర్మనీలోని వర్మ్స్ నగరంలో నాటి ఐదో చార్ల్స్ చక్రవర్తి మార్టిన్ లూథర్ కి వ్యతిరేఖంగా శాసనం జారీ చేసిన రోజు. దీనినే ఈడిక్ట్ ఆఫ్ వర్మ్స్ లేక వర్మ్స్ శాసనం అంటారు. లూథర్ రచనల్ని నిషేధిస్తూ, ఆయన్ని రాజద్రోహిగా ప్రకటిస్తూ చేసిన శాసనం ఇది. లూథర్ ను నిర్బంధించి రాజు ముందు నిలబెట్టాలన్నది శాసనం. ఈ శాసనాన్ని గట్టిగా అమలు చేయలేకపోయినా ఈ శాసనం వల్ల ఆ తర్వాత లూథర్ తన కదలికల్ని నియంత్రించుకోవాల్సి వచ్చింది. కాలక్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మార్టిన్ లూథర్ నాటి మతాధిపతి పోప్ కు వ్యతిరేఖంగా తిరుగుబాటు చేసి సంఘ సంస్కరణకు నాంది పలికాడన్న చరిత్ర మనకు విదితమే.