-
మన చిత్తం vs దేవుని చిత్తం
చాన్నాళ్ల క్రితం ఇంగ్లీష్ క్రైస్తవ మేధావి సి. ఎస్. లూయిస్ ఒక మాటన్నారు. “నరకంలో పాడుకునే పాట ఒక్కటే—నా చిత్తమే సిద్ధించింది కదా—అని.” నిజమే. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచే వాళ్ళు పరలోక రాజ్యంలో చేరలేరు. నా తండ్రి చిత్తం చేసే వాళ్ళే పరలోకం చేరతారు—అని మన ప్రభువు ముందే చెప్పారు (మత్త.7.21). విశ్వాసికి అవిశ్వాసికి ఇదే తేడా. అవిశ్వాసి తన ఇష్టానుసారం జీవిస్తాడు. నిజమైన విశ్వాసి ప్రభువు చిత్తానుసారం జీవిస్తాడు…
-
క్రీస్తుకు పట్టం కట్టే పరిచర్య
“సెలబ్రిటీ సేవకుల” కాలంలో జీవిస్తున్నాం మనం. వేదికలపైన “దైవ జనులు” సన్మానాలు చేయించుకుని వేడుకలు చేసుకుంటున్న దినాలివి. యూట్యూబ్ లో “లైక్స్” కొట్టించుకుంటూ, వాటికి “ర్యాంకింగ్స్” ఇచ్చుకుంటూ, “బౌన్సర్లను” పెట్టుకుని, కానుకల కాసులతో “దైవ సేవకులు” BMW లలో ఊరేగుతున్న రోజులివి. తాము విమానమెక్కితే వీడియో, “జూ” కెళితే వీడియో, తమ పిల్లలు ఆడినా పాడినా వీడియో. సామాజిక మాధ్యమాల్లో “అంతా మనదే హవా” అన్నదే యావ. పరిచర్య అంటే “మనమూ మన…
-
సర్వాధికారికి శిరస్సువంచే సేవ
ప్రభువు తన సంఘానికి ఇచ్చిన చిట్టచివరి ఆజ్ఞ, అంతిమ బాధ్యత—సర్వ మానవాళికి సువార్త ప్రకటించడం! సువార్త సర్వ జనావళికి లేక “సమస్త జనులకు” (మత్త.28.19) లేక “సర్వ సృష్టికి” (మార్కు 16.15) ఎందుకు ప్రకటించాలి? అది క్రైస్తవులకే ఎందుకు పరిమితం కాదు?
-
సమస్యని దేవుడి చేతిలో పెట్టండి
మనిషి జీవితం కష్టాలమయం. విశ్వాసులైనా అవిశ్వాసులైనా, ఎవరికైనా కష్టాలు తప్పవు. స్త్రీ కన్న ప్రతి మనిషీ కడగండ్ల పాలు కావలసిందే అన్నాడు యోబు (14.1). ఐతే కొన్ని సందర్భాల్లో అలవికాని సంకటాలు, సంక్షోభాలు మన జీవితంలో వచ్చి పడతాయి. అప్పుడు మనం నిస్సహాయులమైపోతాం. ఎటూ దిక్కుతోచని పరిస్థితి. అపుడు దేవుడొక్కడే దిక్కు!