ఏక తంతి టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టిన శామ్యూల్ ఎఫ్. బి. మోర్స్ మొదటి సారి దాన్ని ప్రదర్శించింది ఈ రోజే. అమెరికా సుప్రీం కోర్టు నుంచి బాల్టిమోర్ కి ఆయన మొట్టమొదటి సారి టెలిగ్రాం సందేశం పంపారు. సంఖ్యాకాండం 23.23 లోని “దేవుని కార్యాలు” (What God has wrought) అనే వాక్యం ఆయన మోర్స్ కోడ్ ద్వారా మొదట పంపిన సందేశం.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన తాను కనుక్కున్న టెలిగ్రాఫ్ పద్ధతిని ముందుగా ప్రజల్లోకి తీసుకురాలేక పోయారు. ఈ లోపు మోర్స్ కంటే ఆలస్యంగా మరో టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టిన కుక్ (ఇంగ్లండ్) దాన్ని ప్రాచుర్యంలోకి తేవడంతో మోర్స్ పేటెంట్ కోసం దాదాపు దశాబ్ద కాలం పాటు న్యాయ పోరాటం చేయవలసి వచ్చింది.
“నాకున్నది ఒకే ఒక ఆశా కిరణం. దాన్ని నేను తక్కువ అంచనా వేయలేను. దేవుడే నా నమ్మకం. నేను ఆయన వైపు చూసినప్పుడు నాలోని ప్రతి భవిషత్ భయం పటాపంచలై పోతుంది. నాకో స్వరం ఎప్పుడూ వినపడినట్టుగా ఉంటుంది. ‘ గడ్డి పూవులను దేవుడిలా అలంకరిస్తే మరి నిన్ను తప్పక అలంకరిస్తాను కదా ‘. ఇదే నా విశ్వాసం. ఆయన సర్వ పాలనలో కరిగించే కార్యం కోసం నేను ఎదురుచూస్తాను” అని ఒకానొక నిరాశా సమయంలో మోర్స్ రాసుకున్నాడు. ఆ తర్వాత వేగంగా సమాచారాన్ని పంపడానికి ప్రపంచం అంతా ఆ “మోర్స్ కోడ్” నే ఎక్కువ ఉపయోగించారు.