1898 మార్చి 10
జార్జ్ ముల్లర్ (1805-1898) గొప్ప క్రైస్తవ మత ప్రచారకుడు, ఇంగ్లాండ్, బ్రిస్టల్లో యాష్లే డౌన్ అనాథాశ్రమ స్థాపకుడు. ఈయన దేవుని ఏర్పాటుపై అచంచలమైన విశ్వాసానికి ప్రసిద్ధి గాంచాడు. ఎప్పుడూ విరాళాల మీద ఆధారపడలేదు, కానీ వేలాది మంది అనాథల అవసరాలను తీర్చడానికి ప్రార్థనపై మాత్రమే ఆధార పడేవాడు. తన జీవితకాలంలో, ముల్లర్ 10,024 మంది అనాథలను చూసుకున్నాడు. ఈయన 117 పాఠశాలలను స్థాపించాడు, ఇవి 120,000 కంటే ఎక్కువ మంది క్రైస్తవ విద్యను అందించాయి. ఈయన ప్లైమౌత్ బ్రదర్న్ ఉద్యమ స్థాపకులలో ఒకడు. తరువాత విభజన సమయంలో, ఈయన బృందాన్ని ఓపెన్ బ్రదరెన్ అని పిలిచారు.