క్రైస్తవ విమర్శ

అసలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది మరింత సత్యం!

పరమ తండ్రే మనకు ఆదర్శం

కుటుంబ బాధ్యతల్లో తండ్రి పాత్ర అత్యంత కీలకమైంది, ప్రాముఖ్యమైంది కూడా. జాతి నిర్మాణంలో కుటుంబ పాత్ర మౌళికమైంది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. ఆ పౌరులు కుటుంబంలోనే తయారవుతారు. ఆ కుటుంబానికి రథసారథి తండ్రి. నాయకుడైనా, నేరస్తుడైనా కుటుంబం నుంచే రావాలి. నీతి నిజాయితీ ఉన్న పౌరులైనా, నీతిమాలిన సంఘవిద్రోహ శక్తులైనా కుటుంబం నుంచే వస్తారు. కుటుంబంలో తండ్రి ఎలాంటి పాలన చేస్తాడు అన్నదాని మీదే పిల్లల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తండ్రి బా అంత గురుతరమైనది. దేశానికి ఆయువుపట్టు తండ్రి ఐతే కుటుంబానికి ఆయువుపట్టు తండ్రే!

క్రీస్తు మనస్తత్వం

మనస్తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మనస్తత్వమే మనిషి ప్రవర్తనను శాసిస్తుంది. మనస్తత్వమంటే మనిషి ప్రవృత్తి, ఆలోచనా సరళి, వైఖరి—మనల్ని మనం చూసుకునే దృష్టి, ఇతరుల్ని చూసే దృష్టి. ప్రవృత్తిని బట్టే వృత్తి ఉంటుంది. ఆలోచనా సరళిని బట్టే ఆచరణా శైలి ఉంటుంది. మరి క్రీస్తు మనస్తత్వమంటే ఏంటి?

దేవునికి భయపడండి

నేడు క్రైస్తవంలో బాగా కొరవడింది అంటూ ఏదైనా ఉంది అంటే అది “దేవుని భయం” అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అన్యులైనా వాళ్ళ దేవుళ్ళకు భయపడుతున్నారు గానీ మనలో చాలా మందికి ఆ స్పృహ లేదు. సంఘారాధన జరుగుతున్నపుడు మోగే సెల్ ఫోన్స్, వాక్య పరిచర్య జరుగుతున్నపుడు పక్క వారితో మాట్లాడే తీరు, ఓ పక్క వాక్య ప్రబోధం జరుగుతుంటే స్టేజ్ మీద కూర్చున్న అయ్యవార్లు మాట్లాడుకుంటున్న తీరు, ప్రార్థన మధ్యలో వచ్చి కాఫీ తాగుతారా అని అడగడం, రాజకీయ నాయకులు రాగానే ప్రసంగం మధ్యలో ఆపేసి, లేచి నిలబడి వారికి పెద్ద పీట వేయడం, దేవుని మందిరంలోనే కీచులాడుకోవడం, పైగా దాన్ని యూట్యూబ్ లో పెట్టడం వంటివి చూస్తుంటే దైవ భయం మనకు బొత్తిగా లేదని ఇట్టే చెప్పేయ వచ్చు. “లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను” (కీర్త.33:8) అని ఉంది. మన దేవుడి పట్ల మన వైఖరే ఇలా ఉంటే అన్యజనులు ఆయనకు ఎలా భయపడతారు?