1603 మార్చి 24
క్వీన్ ఎలిజబెత్ I (1533–1603) ఈమె 1558 నుండి మరణించే వరకు ఇంగ్లండ్ – ఐర్లాండ్లను పాలించింది, ట్యూడర్ రాజవంశంలో చివరి మరియు ఎక్కువ కాలం పాలించిన, వర్జిన్ క్వీన్ అని పిలువబడే ఈమె వివాహం చేసుకోలేదు. పురుషాధిక్య ప్రపంచంలో తన అధికారాన్ని నైపుణ్యంగా కొనసాగించింది. ఇంగ్లండ్ లో ప్రొటెస్టంటిజాన్ని దృఢంగా స్థాపించడంలో కీలక పాత్ర పోషిం చెను. ప్రొటెస్టంట్ లను ఘోరాతి ఘోరంగా హింసించిన ఈమె కాథలిక్ సోదరి, మేరీ.I పాలన తర్వాత, ఎలిజబెత్ కాథలిక్ పునరుద్ధరణను తిప్పికొట్టి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను తిరిగి స్థాపించింది. ఈమె సర్వోన్నత చట్టాన్ని ఆమోదించి, తనను తాను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సుప్రీం గవర్నర్గా చేసింది, పాపల్ అధికారాన్ని తిరస్కరించింది. ఈమె ఇంగ్లీష్ బైబిల్ అనువాదాలను, ప్రొటెస్టంట్ బోధనలను ప్రోత్సహించింది.