1910 ఫిబ్రవరి 26
ఎస్తేరు E. బాల్డ్విన్ (1840-1910) చైనాలో సేవచేసిన అమెరికన్ మిషనరీ, ఈమె సువార్త ప్రచారం, విద్య వ్యాప్తి, స్త్రీలమధ్య పరిచర్య, అంకితభావం ఎన్నతగినవి. కావున ఈమెను “చైనీస్ ఛాంపియన్” అనే బిరుదుతో పిలిచేవారు. ఈమెకు చైనా మతపరమైన, రాజకీయ సమస్యలపై లోతైన అవగాహన ఉంది. చైనా – అమెరికా మధ్య మెరుగైన సంబంధాలను పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిరి. బాల్డ్విన్ న్యూయార్క్ ఉమెన్స్ మిషనరీ సొసైటీకి అధ్యక్షురాలిగా రెండు దశాబ్దాలు పనిచేశారు, మిషనరీ పని, సాంస్కృతిక అవగాహన కోసం వాదించారు.