1999 ఏప్రిల్ 22
డేమ్ క్రిస్టియన్ హోవార్డ్ (1916-1999) బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆంగ్లికన్ తత్త్వవేత్త, మహిళల పౌరోహిత్యానికి పాటుపడిన నాయకురాలు. ఈమె జీవితాన్ని థియాలజీ అధ్యయనానికి, క్రైస్తవ సమైక్యతకు, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ లో ప్రగతిశీలమైన మార్పులకు అంకితం చేసింది. ఈమె మహిళలల హక్కులకు జాతీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా పోరాడారు. 1986 నూతన సంవత్సర సత్కారాల్లో, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కి, బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ కు చేసిన సేవలకుగాను ఈమెకు “డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” బిరుదు లభించింది. ఈమె ఆంగ్లికన్ చర్చి, క్రైస్తవ సమైక్యతా చర్చలపై చెరగని ముద్ర వేశారు. “మూవ్మెంట్ ఫర్ ది ఆర్డినేషన్ ఆఫ్ ఉమెన్” అనే ఉద్యమానికి ఈమె వ్యవస్థాపక సభ్యురాలు