1952 ఏప్రిల్ 02
శామ్యూల్ మరినస్ జ్వెమర్ (1867–1952) “ఇస్లాంపై అపొస్తలుడు”గా ప్రసిద్ధి చెందారు. ఈయన మధ్యప్రాచ్యంలో ముస్లింలకు సువార్త ప్రకటించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన అమెరికన్ మిషనరీ. 1889లో అమెరికన్ అరేబియన్ మిషన్ను స్థాపించి, అరేబియా, బహ్రైన్, ఈజిప్ట్, ఇరాక్ వంటి ప్రదేశాలలో 1929 వరకు సువార్త వ్యాప్తికి కృషి చేశారు. బహ్రైన్ లో అమెరికన్ మిషన్ ఆసుపత్రిని స్థాపించారు. 1930-1937 వరకు ప్రిన్స్టన్ థియోలాజికల్ సెమినారీలో ప్రొఫెసర్గా, తన శక్తివంతమైన ఉపన్యాసాలతో వేల మందిని మిషనరీ సేవలోకి రప్పించారు. జ్వీమర్ మిషనరీ సేవకు అనేక క్రైస్తవులను ప్రేరేపించి, మోస్లేమ్ వరల్డ్ అనే పత్రికను 35 సంవత్సరాలు సంపాదకత్వం వహించారు.