1865 ఏప్రిల్ 15
అబ్రహం లింకన్ (1809 – 1865) గొప్ప పేరున్న అమెరికా అధ్యక్షుడుగా ప్రపంచములోనే తెలియని వారు ఉండరు. ఈయనకు చిన్నతనం నుండి ఎదురైన కష్టాలే ఎత్తైన స్థానానికి ఎదగటానికి సహాయపడినవి. ఈయన కుటుంబ నేపథ్యం వల్ల వచ్చిన మానవతా దృష్టికోణం, ఆత్మవిశ్వాసం, నిబద్ధత, పేద జీవితం, విద్య, శ్రమ, దృఢ సంకల్పం ఇవన్నీ ఈయనను గొప్ప నాయకుడిగా, రాష్ట్రపతిగా మార్చాయి. దీని వల్ల సామాన్యుల బాధలు అర్ధం చేసుకోటానికి, ప్రజలకు న్యాయం చేయటానికి దోహదపడింది. మానవ హక్కులు, సమానత్వం, న్యాయం కోసం పోరాడాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పౌరయుద్ధాన్ని నడిపించాడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో దేశాన్ని ఏకతాటిపై నిలిపిన మహా నాయకుడు. బానిసత్వాన్ని నిర్మూలించడంలో అత్యంత కీలక పాత్ర పోషించి, గొప్ప పేరు గాంచాడు.