2024 ఏప్రిల్ 14
జార్జ్ వెర్వర్ (1938–2023) ప్రపంచంలోని అతిపెద్ద మిషనరీ సంస్థలలో ఒకటైన ఆపరేషన్ మొబిలైజేషన్ (OM) వ్యవస్థాపకుడు. ఈయన యుక్త వయస్సులోనే, సంపద, భవిష్యత్ అవకాశాలను త్యాగం చేసి, దేవుని సేవలో అడుగుపెట్టాడు. విభిన్న మత సంప్రదాయాల మధ్య సువార్త ఎలా పని చేయగలదో, ఆప్రకారముగా ఈయన సువార్త ప్రచారం పట్ల అసాధారణమైన విధానం, మిషన్ ల పట్ల మక్కువతో కూడిన హృదయం, ముఖ్యంగా సువార్త చేరుకోని మారు మూల ప్రాంతాలలో ప్రజలవద్దకు లోతైన నిబద్ధతతో సువార్తను వ్యాప్తి చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఈయన యేసునందు విశ్వాసముంచిన ప్రజలందరు కచ్చితంగా శిష్యత్వం తీసుకోవాలని తీవ్రంగా ప్రోత్సహించిన ఉత్సాహవంతుడైన ప్రచారకుడు. వేలాది యువతను మిషనరీ సేవకు ప్రేరేపించాడు, ప్రపంచాన్ని యేసు కొరకు జయించండి అనే భారమును వారికి పంచాడు.