1587 ఏప్రిల్ 18
జాన్ ఫాక్స్ (1517 – 1587) రచించిన హతసాక్షులు, అని పిలువబడే ఈయన పుస్తకం బాగా పేరు పొందింది. ఈ పుస్తకం వారి విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన క్రైస్తవుల జీవితాలను చెబుతుంది. ముఖ్యంగా 14వ శతాబ్దానికి చెందిన ఇంగ్లీష్ ప్రొటెస్టంట్లు, బ్లడీ మేరీ అనబడే క్వీన్ మేరీ I పాలనలో బాధపడ్డ వారి కథనాలు ఇందులో పొందుపరచబడ్డాయి. అమరవీరుల బాధలను, దైవభక్తిని వీరోచితంగా చిత్రీకరించడం ద్వారా ఇది ప్రొటెస్టంట్ గుర్తింపును రూపొందించింది. ఫాక్స్ ప్రొటెస్టెంట్ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నవాడు. రాజు మారడమే కాదు, దేశం మొత్తం మారిన సందర్భంలో కూడా ఈయన సత్యాన్ని వదలలేదు. ఇంగ్లాం డ్లో ప్రొటెస్టెంట్ ఉద్యమం బలపడడానికి ఫాక్స్ రచనలు ఒక ప్రేరణగా నిలిచాయి.