alfred-saker

1880 మార్చి 12

ఆల్ఫ్రెడ్ సేకర్ (1814-1880) ఆఫ్రికాలోని కామెరూన్‌లో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఈయన బాప్టిస్ట్ మిషనరీ సొసైటీతో అనుబంధం కలిగి, పశ్చిమ ఆఫ్రికాలో సువార్త ప్రచారం, అనువాదం, క్రైస్తవ సంఘాలను స్థాపించడంలో ఈయన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఈయన కేవలం “మిషనరీ టు ఆఫ్రికా” అని పిలవబడాలని ఇష్టపడ్డాడు. 1858లో, ఈయన స్పానిష్ ద్వీపం ఫెర్నాండో పో నుండి దక్షిణ కామెరూన్ కు ఒక మిషన్‌కు నాయకత్వం వహించాడు, అక్కడ బింబియా చీఫ్‌ల నుండి భూమిని కొనుగోలు చేసి, విక్టోరియాను స్థాపించాడు, తరువాత 1982లో లింబేగా పేరు మార్చాడు. ఈయన, ఫెర్నాండో పో కామెరూన్‌లో బాప్టిస్ట్ చర్చిలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు.

alfred-saker

1880 March 12

Alfred Saker (1814-1880) was a British missionary who played a key role in spreading Christianity in Cameroon, Africa. He was associated with the Baptist Missionary Society and is best known for his efforts in evangelism, translation, and establishing Christian communities in West Africa. He preferred to be known simply as a “Missionary to Africa”. In 1858, he led a mission from the Spanish island of Fernando Po to Southern Cameroons, where he purchased land from Bimbia chiefs and founded Victoria, later renamed Limbe in 1982.

1823 మార్చి 07

విలియం వార్డ్ (1769–1823) ఇంగ్లాండు దేశము నుండి ఇండియాకు వచ్చిన బాప్టిస్ట్ మిషనరీ. ఈయన, విలియం క్యారీ, జాషువా మార్ష్ మాన్ లతో పాటు సెరాంపూర్ త్రయం యొక్క ముఖ్య సభ్యుడు. బైబిళ్లు, కరపత్రాలు, క్రైస్తవ సాహిత్యం, విద్యా పుస్తకములు, బహుళ భారతీయ భాషలలో ముద్రించటం, ప్రచురణకర్తగా అందుబాటులో ఉంచడం ఈయన నైపుణ్యం ద్వారా సువార్తను వ్యాప్తి చేయడంలో సహాయపడింది. ముఖ్యంగా భారతదేశంలోనే ప్రధానమైన బెంగాల్లోని సెరాంపూర్ మిషన్లో ప్రింటింగ్ వ్యవస్థను కీలకంగా ఈయనే నిర్వహించేవాడు. ఇంతకు మించి ఈయన క్రైస్తవ మతాన్ని బోధించడం, వ్యాప్తి చేయడంలో చురుకుగా నిమగ్నమయ్యాడు. హిందూ ఆచారాలు, సంప్రదాయాలపై తన లోతైన అధ్యయనం భారతీయ ప్రజలకు క్రైస్తవ బోధనలను మరింత ప్రభావవంతంగా తెలియజేయడానికి వీలు కల్పించింది.

1823 March 07

William Ward (1769–1823) was an English Baptist missionary and a key member of the Serampore Trio, alongside William Carey and Joshua Marshman. His expertise as a printer and publisher helped spread the gospel by making Bibles, tracts, and educational materials available in multiple Indian languages. He played a crucial role in printing and publishing Christian literature in India, particularly at the Serampore Mission in Bengal, where he managed the Serampore printing press, the first major Protestant printing house in India. Beyond printing, he actively engaged in preaching, teaching, and spreading Christianity.