1922 ఏప్రిల్ 05
పండిత రమాబాయి (1858-1922) భారత దేశంలో మొదటి మహిళ మిషనరీ, తన భర్త మరణానంతరం, వైద్య విద్య కొరకు 1883 లో ఇంగ్లాండుకు వెళ్లగా, అక్కడ కలసిన ఆంగ్లికన్ సోదరి చూపించిన దయ, సేవకు ప్రభావితమై ఈమె క్రైస్తవ్యము స్వీకరించెను. తర్వాత అమెరికాలో విస్తృతంగా పర్యటించి నిరుపేద భారతీయ మహిళల కోసం నిధులు సేకరించారు. ఈ నిధులతో బాల వితంతువుల కోసం శారదా సదన్ ను ఏర్పాటు చేసిరి. 1890లో, ఈమె పూణే సమీపంలోని కేద్గావ్లో ముక్తి మిషన్ అనే క్రిస్టియన్ ఛారిటీని స్థాపించిరి, ఆ తర్వాత దీనిని పండిత రమాబాయి ముక్తి మిషన్‌గా మార్చారు. ముక్తి మిషన్ అంటే వెలుగును ప్రసారించే గొప్ప ఆశ్రమం, దీని నినాదం “రెస్క్యూ, రీడీమ్, రీస్టోర్.”