2013 మార్చి 06
సహుదరుడు లాజర్ సేన్ (1927-2013) సహో. భక్త్ సింగ్ గారితో కలసి పని చేసిన దేవుని సేవకునిగా అందరికి బాగా తెలుసు. ఈయన రక్షించబడిన దినము నుండి ఆత్మయందు తీవ్రత, సువార్త భారము కలిగి యున్నారు. ముఖ్యముగా! ఈయన పరిచర్యలో ప్రధాన భాగము పాటల సంగీతము. బైబిలులో దావీదు రాజువలె చిన్న తనము నుండి, పాటలు రాయటం, సంగీతం కూర్చటం, వాయిద్యాలన్నియు వాయించటం, పాడటం, వెన్నతో పెట్టిన విద్యగా అలవరచుకొనిరి. దేవుడు ఈయనకు మంచి గాత్రమును అనుగ్రహించెను. దేవుడు ఈయనకు అనుగ్రహించిన తలాంతులన్నియు ఆయనను సేవించటానికే, మహిమపర్చటానికే ఉపయోగించిరి. ఈయన ప్రతిభను తన పాఠశాల ఉపాధ్యాయులు చాలా చిన్న వయస్సు నుండి గుర్తించారు. ఈయన 7 సంవత్సరాల వయస్సునుండి పాడటం, హార్మోనియం వాయిస్తూ కచేరీలు ఇచ్చేవారు.