2021 ఏప్రిల్ 06
సహూ. ఎపఫ్రాస్ ఘోగ్లే (1950-2021) హెబ్రోన్ సేవకునిగా అందరికి సుపరిచితులు. ఈయన రక్షణ, పూర్తీ సేవా పరిచర్య ఒకేసారి ప్రారంభమైనవి. నాటినుండి ఆత్మల భారంతో, వివిధ సువార్త పరిచర్యలు చేసేవారు. ఇంటింటికి, అతి దూర ప్రాంతాలకు సైకిళ్ళ మీద క్యాంపులు, బహిరంగ సువార్తలు, రాత్రిపూట సువార్త కూడికలు ఈలాగు, అన్నిరకాల అవకాశాలను దేవుని మహిమార్థమై సద్వినియోగపరచు కొనేవారు. ప్రాముఖ్యముగా! ప్రభువు ఈయనకు అప్పగించిన ప్రత్యేక భాద్యత, ఈయన వ్యక్తిగత సువార్త. ఈ భాద్యత యెడల మక్కువతో చివరివరకు ప్రత్యేక శ్రద్ధ వహించిరి. ఈయన దగ్గర ఎప్పుడూ కరపత్రాలు, సువార్త పుస్తకములు అందుబాటులో ఉంచుకొని ప్రతిరోజూ ఉదయం విధిగా సువార్త చెప్పటానికి వెళ్ళుతుండేవారు. ఈయన బయట ఉన్నపుడు, సమయము సందర్భము లేకుండా, ప్రతి నిముషము సద్వినియోగ పరచుకొనుచు వ్యక్తిగతంగా సువార్త చెప్పేవారు.