Bro. Epaphras Ghogle (1950-2021) was well-known as a Hebron servant of God. Chosen Vessel, Soul-burdened personal evangelist, Prayer warrior, Servant of God.

2021 ఏప్రిల్ 06

సహూ. ఎపఫ్రాస్ ఘోగ్లే (1950-2021) హెబ్రోన్ సేవకునిగా అందరికి సుపరిచితులు. ఈయన రక్షణ, పూర్తీ సేవా పరిచర్య ఒకేసారి ప్రారంభమైనవి. నాటినుండి ఆత్మల భారంతో, వివిధ సువార్త పరిచర్యలు చేసేవారు. ఇంటింటికి, అతి దూర ప్రాంతాలకు సైకిళ్ళ మీద క్యాంపులు, బహిరంగ సువార్తలు, రాత్రిపూట సువార్త కూడికలు ఈలాగు, అన్నిరకాల అవకాశాలను దేవుని మహిమార్థమై సద్వినియోగపరచు కొనేవారు. ప్రాముఖ్యముగా! ప్రభువు ఈయనకు అప్పగించిన ప్రత్యేక భాద్యత, ఈయన వ్యక్తిగత సువార్త. ఈ భాద్యత యెడల మక్కువతో చివరివరకు ప్రత్యేక శ్రద్ధ వహించిరి. ఈయన దగ్గర ఎప్పుడూ కరపత్రాలు, సువార్త పుస్తకములు అందుబాటులో ఉంచుకొని ప్రతిరోజూ ఉదయం విధిగా సువార్త చెప్పటానికి వెళ్ళుతుండేవారు. ఈయన బయట ఉన్నపుడు, సమయము సందర్భము లేకుండా, ప్రతి నిముషము సద్వినియోగ పరచుకొనుచు వ్యక్తిగతంగా సువార్త చెప్పేవారు.

Bro. Epaphras Ghogle (1950-2021) was well-known as a Hebron servant of God. Chosen Vessel, Soul-burdened personal evangelist, Prayer warrior, Servant of God.

2021 April 06

Bro. Epaphras Ghogle (1950-2021) was well-known as a Hebron servant of God. His salvation and full-time service began simultaneously. From that time, with a huge burden, he ministered in various gospel ministries. He travelled door to door to preach the gospel, went on bicycle camps to remote areas, held open-air gospel meetings, and organized nighttime gospel meetings, utilizing every opportunity for the glory of God. Most notably, the special responsibility the Lord entrusted to him was his personal gospel mission. With great passion and dedication, he faithfully fulfilled this responsibility until the very end.

Bro. Abraham Joseph (1914–1995) was a well-known servant of God, Tireless Gospel Warrior, Prayer Warrior, Soul Winner, Church Planter, Brave Man, Co-worker of Bro. Bakht Singh.

1995 మార్చి 28

సహూదరుడు అబ్రహాం జోసెఫ్ (1914-1995) మంచి పేరున్న పాత కాలపు దేవుని సేవకునిగా సహవాసములో తెలియనివారులేరు. ఈయన బర్మా (ప్రస్తుత మయన్మార్) నుండి వచ్చిన కారణాన బర్మా జోసెఫ్ గా సుపరిచితులు. ఈయన సేవా పిలుపు పొందినప్పటినుండి మండుతున్న హృదయముతో ఆత్మల బారము కలిగి యుండుట వలన, అదే భారంతో బహిరంగ సువార్త పరిచర్యలు చేస్తుండేవారు. కావున, ఈ పరిచర్యలో నైపుణ్యము, అనుభవము చాలా ఎక్కువ. సైన్యములో సైనికుడు ఎలా కష్టపడతాడో, అదేవిధమైన అనుభవము గలవాడై, ఈయన ప్రభువు పరిచర్యలో కూడా క్రీస్తు యేసుని మంచి సైనికునిగా, ప్రాముఖ్యముగా, ఓపెనైర్ స్పెసలిస్ట్ గా గుర్తింపు పొందారు. సహోదరుడు భక్త్ సింగ్ గారు ఈయన శ్రమజీవితాన్ని, క్రమశిక్షణను, ప్రతిభను ముందే గ్రహించి, దైవదాసుని ఆధ్వర్యములో జరిగే సువార్త దండయాత్రలకు, పరిశుద్ధ సమాజ కూడికల చివరి రోజు జరిగే ఉరేగింపులలోను సక్రమముగా నిర్వహించగలడని, ఈయన నాయకత్వం వహించేలా ప్రోత్సహించేవారు.

Bro. Abraham Joseph (1914–1995) was a well-known servant of God, Tireless Gospel Warrior, Prayer Warrior, Soul Winner, Church Planter, Brave Man, Co-worker of Bro. Bakht Singh.

1995 March 28

Bro. Abraham Joseph (1914–1995) was a well-known servant of God from old times and was familiar to everyone in the fellowship. As he came from Burma (present-day Myanmar), he was popularly known as “Burma Joseph.” From the time of his Lord’s call, he had a burning heart for perishing souls, and with that burden, he engaged in open-air gospel ministry. Therefore, he had great expertise and experience in this ministry. Just as a soldier endures hardships in the army, he was recognized as a good soldier of Jesus Christ in the Lord’s ministry through his experience, particularly as an open-air specialist.

2007 మార్చి 18

నేటి విశ్వాస నాయకుడుసహూ. V క్రిష్టాఫర్ గారుపరలోక పిలుపు : 18 మార్చి, 2007నమ్మకమైన దైవ సేవకుడు, సువార్తికుడు, ఆత్మల విజేత. సహూదరుడు వర్ధనపు క్రిష్టాఫర్ గారు (1928-2007) గొప్ప పేరున్న దేవుని సేవకునిగా గోదావరి జిల్లాల లోను, సహవాసములోను తెలియనివారులేరు. ఈయన రక్షింపబడినప్పటి నుండి ఆత్మల బారముతో సువార్త పరిచర్య చేయుచుండెడివారు. ఈ భారముతో ప్రభువు కొరకు ఈయన సంపాదించిన ఆత్మలు అనేకం. సహవాసములో ఉభయ గోదావరి జిల్లాలలో భీమవరము మొదటి సంఘము. ఈ సంఘములో

2007 March 18

Bro. Vardhanapu Christopher (1928-2007), a servant of God of great renown, was well known in the Godavari districts and among the fellowship. Since the time of his salvation, he preached the Gospel with a great burden for perishing souls. With this burden, he won many souls for the Lord. In the fellowship, the first church in the East and West Godavari districts was established in Bhimavaram. In this church, as a disciple of Bro. Aravindam, he inherited the ministry, laboured faithfully, and many were blessed by the fruits of his toil and service. He was a man of great humility, believing that suffering hardships for the Lord was good, and he led an exemplary life as a lowly and humble servant of God.

1932 ఫిబ్రవరి 04

సహూ. భక్త్ సింగ్ గారు బాప్తిస్మము ఆవశ్యకతను ఎలా గుర్తించిరి? తరువాత ఇచ్చే హస్త నిక్షేపణను, సంఘ క్రమమును ఎలా సంస్కరించిరి? సహూ. భక్త్ సింగ్ గారు మారుమనస్సు పొందిన రెండు సంవత్సరముల తర్వాత బాప్తిస్మము తీసుకొనెను. ఈ రెండు సంవత్సరములు బైబిలు చదవటంలోనే నిమగ్నమై, బాప్తిస్మము తనకు అవసరము లేదని భావించేవారు.

1932 February 04

Hero of FaithBro Bakht SinghBaptism : 4 February 1932 (Proverbs 10:7) Church Reformer. How did Bro. Bakht Singh recognise the necessity of Baptism? How did he reform the practice of laying on of hands after Baptism? Bro. Bakht Singh was Baptized two years after his conversion. During these two years, he was so deeply immersed