1826 ఏప్రిల్ 03
రెజినాల్డ్ హెబెర్ (1783–1826) కలకత్తాలో మిషనరీ సేవచేసిన ఆంగ్ల బిషప్. ఈయన జీవించిన కాలం తక్కువైనా, మన దేశానికి చేసిన సేవలు ఎక్కువే. ఈయన “హోలీ, హోలీ, హోలీ! లార్డ్ గాడ్ ఆల్మైటీ” అనే ఆరాధన గీతము, బ్రైటెస్ట్ అండ్ బెస్ట్” అనే క్రిస్మస్ గీతములు సహా ఇంకా కీర్తనలకు ప్రసిద్ధి. ఇవి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా, అన్ని చర్చిలలో విస్తృతంగా పాడబడుతున్నాయి. ఈయన 1823 నుండి మరణించే వరకు కలకత్తా బిషప్గా సేవచేశాడు. ఈయన స్వల్ప కాలంలో, విద్య, సువార్త ప్రచారానికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలో క్రైస్తవ మిషన్లను బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. అభివృద్ధిలో నిలిచిపోయిన బిషప్ కళాశాలకు, విజయవంతంగా నిధులు సేకరించి, అదనపు భూమి మంజూరు చేయడం, దాని నిర్మాణాన్ని పునరుద్ధరించడం వంటి సవాళ్లను ఆయన పరిష్కరించారు.