1995 మార్చి 28
సహూదరుడు అబ్రహాం జోసెఫ్ (1914-1995) మంచి పేరున్న పాత కాలపు దేవుని సేవకునిగా సహవాసములో తెలియనివారులేరు. ఈయన బర్మా (ప్రస్తుత మయన్మార్) నుండి వచ్చిన కారణాన బర్మా జోసెఫ్ గా సుపరిచితులు. ఈయన సేవా పిలుపు పొందినప్పటినుండి మండుతున్న హృదయముతో ఆత్మల బారము కలిగి యుండుట వలన, అదే భారంతో బహిరంగ సువార్త పరిచర్యలు చేస్తుండేవారు. కావున, ఈ పరిచర్యలో నైపుణ్యము, అనుభవము చాలా ఎక్కువ. సైన్యములో సైనికుడు ఎలా కష్టపడతాడో, అదేవిధమైన అనుభవము గలవాడై, ఈయన ప్రభువు పరిచర్యలో కూడా క్రీస్తు యేసుని మంచి సైనికునిగా, ప్రాముఖ్యముగా, ఓపెనైర్ స్పెసలిస్ట్ గా గుర్తింపు పొందారు. సహోదరుడు భక్త్ సింగ్ గారు ఈయన శ్రమజీవితాన్ని, క్రమశిక్షణను, ప్రతిభను ముందే గ్రహించి, దైవదాసుని ఆధ్వర్యములో జరిగే సువార్త దండయాత్రలకు, పరిశుద్ధ సమాజ కూడికల చివరి రోజు జరిగే ఉరేగింపులలోను సక్రమముగా నిర్వహించగలడని, ఈయన నాయకత్వం వహించేలా ప్రోత్సహించేవారు.