1727 మార్చి 31
సర్. ఐజాక్ న్యూటన్ (1643–1727) ప్రఖ్యాత శాస్త్రవేత్త మాత్రమే కాదు, తన జీవితంలో గణనీయమైన భాగాన్ని బైబిల్ అధ్యయనంలో గడిపిన భక్తుడు కూడా. ఈయన నైపుణ్యం, ముఖ్యంగా భౌతిక శాస్త్రములో చలనం – గురుత్వాకర్షణ నియమాలకు అద్భుతమైన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఈయన శాస్త్రవేత్త అయినందున, చాలామంది ఈయనను దేవుని ఉనికికి, సృష్టికి వ్యతిరేకమని వాదిస్తారు, కానీ న్యూటన్ ఎల్లప్పుడూ దేవుణ్ణి విశ్వసించాడు, న్యూటన్ సైన్స్ – విశ్వాసం మధ్య ఎటువంటి వైరుధ్యాన్ని చూడలేదు. దేవుని సృష్టిని సరైన విధంగా అర్ధము చేసుకొన్న గొప్ప శాస్త్రవేత్త & గొప్ప వేదాంతవేత్త! తన జీవితంలో ఎక్కువ భాగం బైబిల్, క్రైస్తవ వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి అంకితం చేశాడు. ఈయన క్రైస్తవ విశ్వాసం, తన ప్రయోగాలను ప్రభావితం చేసింది. దేవుని సృష్టిని అర్థం చేసుకునే మార్గంగా శాస్త్రీయ ఆవిష్కరణలను చేసి చూపించాడు.