1919 ఏప్రిల్ 17
తిమోతీ రిచర్డ్ (1845-1919) చైనాకు వెల్ష్ బాప్టిస్ట్ మిషనరీగా, చైనా ఆధునికీకరణ, చైనీస్ రిపబ్లిక్ పెరుగుదలను ప్రభావితం చేశాడు. రిచర్డ్ మానవతా ప్రయత్నాలలో లోతుగా పాలుపంచుకున్నాడు, ముఖ్యంగా 1876-1879 ఉత్తర చైనీస్ కరువు సమయంలో కరువు నివారణను నిర్వహించాడు. పనికిరాని పురాతన సాంప్రదాయాలైన, ఆడపిల్లల పాదాలు పెరగకుండా చేయడం వంటి పద్ధతులకు వ్యతిరేక ప్రచారాలు, లింగ సమానత్వంతో సహా సామాజిక సంస్కరణల కోసం గొప్పగా వాదించాడు. సాధారణ ప్రజలతో మాత్రమే కాకుండా చైనా మేధావులు, సంస్కర్తలతో కూడా సువార్తను పంచుకోవడంపై దృష్టి పెట్టాడు. ఈయన చైనీస్ తాత్విక, మతపరమైన ఆలోచనలతో ప్రతిధ్వనించే విధంగా క్రైస్తవ సత్యాలను ప్రదర్శించడం ద్వారా సందర్భోచితమైన క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించాడు.