1933 మార్చి 03
సర్ డా. విలియం జేమ్స్ వాన్ లెస్ (1865-1933) కెనడా దేశము నుండి ఇండియాకు వచ్చిన మెడికల్ మిషనరీ, నేర్పరి అయిన వైద్యుడు, సర్జన్, హాస్పిటల్ నిర్వహణ కూడా బాగా తెలిసినవాడు, మానవతావాది. ఈయన 1894లో భారతదేశంలోని మహారాష్ట్ర, మిరాజ్‌లో మెడికల్ మిషన్‌ను స్థాపించి, 40 సంవత్సరాలు దానికి నాయకత్వం వహించాడు. ఈ మిషన్‌లో భాగంగా, డాక్టర్. వాన్ లెస్ 1897లో మహారాష్ట్రలో మొట్టమొదటి మిషనరీ మెడికల్ స్కూల్‌ను స్థాపించారు, లెప్రసీ శానిటోరియం, క్షయవ్యాధి ఆసుపత్రిని కూడా స్థాపించిరి. ఈయన సేవల ద్వారా ఎంతోమంది విడువబడిన దీర్ఘకాలిక రోగులకు చికిత్స చేసి, పునరావాసం కల్పిస్తూఉండేవారు.